పట్టణంలో నివసించే మహిళల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి స్వయం సహాయక సంఘాల మహిళలు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
మెప్మా ద్వారా పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అర్బన్ మార్కెట్లను ఏర్పాటు చేయనుంది.
ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం,విశాఖలో నెలకొల్పిన అర్బన్ మార్కెట్లు విజయవంతం అయ్యాయి. దీంతో రాష్ట్రంలోని 123 కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఈ నెలలోనే ఏర్పాటు చేయాలని మెప్మా నిర్ణయం తీసుకుంది
ఇప్పటికే రాష్ట్రంలోని మహిళల కోసం జగన్ అన్న మహిళా మార్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి విజయవంతం కావడంతో మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం అర్బన్ మార్కెట్లను కూడా ఏర్పాటు చేయాలని సిటీ మిషన్ మేనేజర్లకు మెప్మ ఎండి ఆదేశాలు జారీ చేశారు
ఈ దుకాణాల ఏర్పాటుకు అయ్యే మొత్తం ఖర్చును మెప్మా చెల్లించనుంది.
ఈ అర్బన్ మార్కెట్లలో పొదుపు మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను విక్రయిస్తారు.
ఈ అర్బన్ మార్కెట్లలో మహిళలు తమ ఇళ్లలో తయారుచేసిన పచ్చళ్ళు, ఆహార ఉత్పత్తులు, వస్త్రాలు ఎంబ్రాయిడరీ వర్క్, హ్యాండ్ క్రాఫ్ట్, బుట్టలు, జ్యూట్ బ్యాగులు, గృహాలంకరణ వస్తువులు, ఫ్యా,న్సీ 1 గ్రామ్ గోల్డ్ లాంటి వాటిని విక్రయించనున్నారు.
ప్రతి నెల రెండు రోజులు తప్పనిసరిగా ఉండేలా పండుగలు ఎగ్జిబిషన్లు వంటి ప్రత్యేక దినాల్లో అదనపు రోజులు కొనసాగిస్తారు.
Leave a Reply