యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పద్ధతిలో మనం  ప్రతి రోజు ఫోన్ పే, గూగుల్ పే, పే టిఎం లావాదేవీలు చేస్తూ ఉంటాము. మన రోజువారీ జీవితంలో ఈ UPI ఎంత ముఖ్యమైన భాగమైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరు వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద లావాదేవీల వరకు యూపీఐ ని వాడుతున్నాం. ఈ నేపథ్యంలో, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ లావాదేవీల లిమిట్స్ కి సంబంధించి కీలక మార్పులు చేసింది. ఈ కొత్త పరిమితులు సెప్టెంబర్ 15, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఈ మార్పులు ప్రధానంగా ఎక్కువ విలువ కలిగిన చెల్లింపుల కి వర్తించనున్నాయి. ఇప్పుడు మీరు ఒకే లావాదేవీలో ఎక్కువ మొత్తంలో డబ్బును సులభంగా పంపించవచ్చు. అయితే కొన్ని రకాల కొనుగోలు లేదా చెల్లింపులకు మాత్రమే ఈ పెంచిన లిమిట్ వర్తిస్తుంది. ఈ కొత్త లిమిట్స్ వేటికి వర్తిస్తాయో ఇప్పుడు చూద్దాం.

పెరిగిన యూపీఐ లావాదేవీల పరిమితులు
కొన్ని ప్రత్యేకమైన లావాదేవీల విభాగాలకు (Categories) ఈ కొత్త పరిమితులు వర్తిస్తాయి. గతంలో ఉన్న పరిమితులు, కొత్తగా పెంచిన లిమిట్స్ వివరాలు ఈ కింది టేబుల్ లో చూడండి:

| లావాదేవీ రకం | ప్రస్తుతం ఉన్న లిమిట్ | కొత్త లిమిట్ (సెప్టెంబర్ 15, 2025 నుంచి) | 
|---|---|---|
| సాధారణ UPI లావాదేవీలు | ₹1,00,000 వరకు (రోజుకు) | అదేవిధంగా కొనసాగుతుంది | 
| ఆరోగ్య రంగం (Hospitals) | ₹1,00,000 వరకు | ₹5,00,000 వరకు | 
| విద్య రంగం (College/University Fees) | ₹1,00,000 వరకు | ₹5,00,000 వరకు | 
| హై-విల్యూ ట్రాన్సాక్షన్స్ | ₹1,00,000 వరకు | ₹5,00,000 వరకు | 
- స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ఇకపై ఐదు లక్షల వరకు ఒకే లావాదేవీలో చెల్లించవచ్చు. ఒక రోజులో మొత్తం లిమిట్ 10 లక్షలు గా ఉంది.
- ప్రయాణానికి సంబంధించి కూడా ఒక లక్ష నుంచి ఐదు లక్షలకు పరిమితి పెంచడం జరిగింది.
- జువెలరీ ఆభరణాల కొనుగోలుకు కూడా ఐదు లక్షల వరకు పరిమితి పెంచడం జరిగింది.
- ఇన్సూరెన్స్ మరియు క్రెడిట్ కార్డు చెల్లింపులకు కూడా ఐదు లక్షల వరకు పెంచిన పరిమితి వర్తిస్తుంది
ఈ మార్పుల వల్ల ప్రయోజనం ఏంటి?
సమయం ఆదా: ఇప్పుడు మీరు పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ ప్రీమియం లేదా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ఒకే లావాదేవీలో పూర్తి చేయవచ్చు. దీనివల్ల పదే పదే చెల్లింపులు చేయాల్సిన అవసరం తగ్గుతుంది.
సులభమైన చెల్లింపులు: అధిక విలువ కలిగిన లావాదేవీలు చాలా సులభంగా, వేగంగా పూర్తవుతాయి. పన్ను చెల్లింపులు, క్రెడిట్ కార్డ్ బిల్లులు వంటివి మరింత సౌకర్యవంతంగా మారతాయి.
డిజిటల్ చెల్లింపులను మరింత వేగవంతంగా మరియు విస్తరించే ఉద్దేశంతో NPCI ఈ నిర్ణయం తీసుకుంది.
ముఖ్య గమనిక: ఈ పెరిగిన పరిమితులు కేవలం వ్యాపారులకు (P2M – Person to Merchant) చేసే చెల్లింపులకే వర్తిస్తాయి. అంటే, మీరు ఏదైనా కంపెనీకి, బీమా సంస్థకు, లేదా వ్యాపార సంస్థకు డబ్బు పంపేటప్పుడు ఈ కొత్త పరిమితులు వర్తిస్తాయి. అంతే గాని ఎవరికైనా నేరుగా వారి నెంబర్ కి లేదా యూపీఐపీ ఐడి కి అమౌంట్ పంపించే బదిలీలకు ఇది వర్తించదు. అనగా సాధారణ వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P – Person to Person) చేసే లావాదేవీల పరిమితిలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఇది ప్రస్తుతం ఉన్నట్లుగానే రోజుకు రూ. 1 లక్ష గా కొనసాగుతుంది.
సెప్టెంబర్ 15 నుంచి ఈ కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి కాబట్టి, మీ అవసరాలకు అనుగుణంగా యూపీఐని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.

Key Changes in UPI Transaction Limits (Effective September 15, 2025)
| Transaction Category | Previous Limit | New Limit(s) | 
|---|---|---|
| General UPI Transactions | ₹1 lakh/day | Remains ₹1 lakh/day | 
| Hospitals / Education (Fees) | ₹1 lakh | ₹5 lakh per transaction | 
| High-Value Payments | ₹1 lakh | ₹5 lakh per transaction | 
| Capital Market Investments | ₹2 lakh per transaction | ₹5 lakh; ₹10 lakh per day | 
| Travel | ₹1 lakh | ₹5 lakh per transaction; ₹10 lakh/day | 
| Jewellery Purchases | ₹1 lakh | ₹5 lakh per transaction; ₹10 lakh/day | 
| Insurance & Credit Card Payments | ₹1 lakh | ₹5 lakh per transaction; ₹10 lakh/day | 
| Business / Merchant Payments | — | ₹5 lakh per transaction (no daily cap) | 
| Collections (EMI, Loan Repayments) | ₹2 lakh | ₹5 lakh per transaction; ₹10 lakh/day | 
| Government e-Marketplace (GeM) | Varies | ₹5 lakh per transaction; ₹10 lakh/day | 
| Foreign Exchange (via BBPS) | — | ₹5 lakh per transaction; ₹5 lakh/day | 
| Digital Account Opening | — | ₹5 lakh per transaction; ₹5 lakh/day | 
| Digital Account – Initial Funding | — | ₹2 lakh per transaction; ₹2 lakh/day | 



