ఆంధ్ర ప్రదేశ్ లోని రైతులకు ముఖ్య సమాచారం.. వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం 2023 సంబంధించి గత ఏడాది ఖరీఫ్ సీజన్ లో పంట నష్టపోయినటువంటి రైతులకు ఉచిత పంటల బీమా అమౌంట్ ను జూలై 8 న సీఎం జమ చేయనున్నారు. ఇందుకు సంబంధించి అభ్యంతరాలకు జూలై 3 వరకు చివరి అవకాశం.
రైతు భరోసా కేంద్రాలలో ఉచిత పంటల బీమా రైతుల జాబితా
గత ఖరీఫ్ సీజన్ లో పంట నష్టపోయినటువంటి రైతుల జాబితాను రైతు భరోసా కేంద్రాల వద్ద జూన్ 30 నుంచి జూలై 3 వరకు ప్రదర్శిస్తున్నారు. ఈ జాబితాలను సామాజిక తనిఖీ కోసం ప్రదర్శిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
రైతులకు జాబితా పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే రైతు భరోసా కేంద్రాలలో జూలై 3 లోపు లిఖిత పూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది.
అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితాను ఈ వారంలోనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.
ఈసారి 10.2 లక్షల మందికి పంటల బీమా అమౌంట్
ఖరీఫ్ 2022 సంబంధించి పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. మొత్తం 10.20 లక్షల మందికి ఈసారి ఈ పంట నష్ట పరిహారాన్ని జులై 8న రైతు దినోత్సవం సందర్భంగా జమ చేయనుంది.
వీరికి మొత్తం 1117.21 కోట్ల మేర పరిహారం చెల్లించాల్సి ఉండగా ఈ అమౌంట్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి.
ఉచిత పంటల భీమా , ఫసల్ భీమా యోజన తో అనుసంధానం
వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకంలో భాగంగా అర్హులైన రైతులలో దిగుబడి ఆదారిత పంటలు నష్టపోయిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా అమౌంట్ అందించనుంది. ఇక వాతావరణ ఆధారిత పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టాన్ని భరించనుంది.
ప్రస్తుతం కేంద్రం 572.59 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 544.62 కోట్ల ను విడుదల చేయనున్నాయి.
వైయస్సార్ ఉచిత పంటల బీమా స్టేటస్ ను ఆన్లైన్ లో చెక్ చేయండి
వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి అర్హత ఉన్న వారి జాబితాను ఆన్లైన్లో కింది లింకు ద్వారా చెక్ చేయండి.
స్టేటస్ చెక్ చేసేటప్పుడు kharif 2022 అని ఎంచుకొని చెక్ చేయవచ్చు.
లేదా రైతులు ఈ క్రాప్ స్టేటస్ ని కూడా చెక్ చేయవచ్చు. ఈక్రాప్ స్టేటస్ ఆధారంగానే పంటల భీమా కూడా అమలు అవుతుంది.
Leave a Reply