తెలంగాణలో కులవృత్తులు చేతివృత్తులు చేసుకునేటటువంటి బీసీలకు లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రస్తుతం అప్లికేషన్స్ కూడా కొనసాగుతున్నాయి.
అయితే తొలి విడుదల ఏ ఏ బీసీ కులాలకు లక్ష రూపాయలు ఇవ్వనున్నారో రాష్ట్ర ప్రభుత్వం కులాల వారిగా లిస్టును విడుదల చేసింది.
లక్ష రూపాయలు పొందేటటువంటి కులాలు ఇవే
తొలి విడత లో ఏ ఏ కులాలకు లక్ష రూపాయలు ఇవ్వనున్నారో జాబితాను బీసీ సంక్షేమ శాఖ విడుదల చేసింది.
1. నాయీ బ్రాహ్మణులు
2. రజక
3. సగర / ఉప్పర
4.కుమ్మరి/శాలివాహన
5.అవుసుల (గోల్డ్ స్మిత్)
6.కంసాలి
7.వడ్రంగి, శిల్పులు
8.వడ్డెర
9. కమ్మరి
10.కంచరి
11.మేదర
12. కృష్ణ బలిజ పూస
13. మేర
(టైలర్స్)
14. ఆరె కటిక
15.ఎంబీసీ కులాలు. [Most Backward Castes]
MBC Caste list in Telangana
36 కులాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేడుకబడిన తరగతుల జాబితాలో చేర్చడం జరిగింది.
Balasanthula, Budabukkala, Dasari, Dommara, Gangireddulavaru, Jangam, Jogi, Katikapala, Mondibanda, Vamsaraju, Pamula, Parthi, Pambala, Peddammavandlu, Veeramushti, Gudala, Kanjara, Reddika, Mondepatta, Nokkar, Pariki Muggula, Yaata, Choppemari, Kaikadi, Joshi Nandiwalas, Mandula, Kunapuli, Patra, Pala – Yekari, Rajannala, Bukka Ayyavaru, Gotrala, Kasikapadi, Sihhula, Sikligar and Orphans.
అయితే పైన పేర్కొన్నటువంటి కులాలను ఎంబీసీ జాబితాలో తెలంగాణ ప్రభుత్వం జోడించడం జరిగింది. అసలు పూర్తి ఎంబీసీ జాబితా పై ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఏ కులాలు పూర్తి ఎంబీసీ జాబితాకు వస్తాయో తెలపాలని ఇప్పటికే ఎంబీసీ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
అయితే అప్లికేషన్ లో బీసీ సి , బీసీ ఈ కులాలు కనిపించడం లేదు. బీసీ సి సబ్ క్యాస్టులలో ఎస్సీ ల నుంచి క్రిస్టియానిటి కి కన్వర్ట్ అయిన వారు, ఇక బీసీ ఈ లో ముస్లిం మైనార్టీలు ఉంటారు. అయితే వీరిని ఇందులో చేర్చక పోవడం గమనార్హం.
ఇక పద్మశాలి, ముదిరాజ్, గౌడ, గొల్ల, కురుమ, మున్నూరు కాపు వంటి కులాల ప్రస్తావన కూడా లేదు. మీసేవ కు వెలితే జాబితా లో మీ కులం లేదు అని వెనక్కు పంపిస్తున్నట్లు సమాచారం.
ఇది చదవండి: బీసీలకు లక్ష అమౌంట్ ఇచ్చేది ఆరోజే..గడువు పొడిగింపు పై మంత్రి క్లారిటీ
బీసీలకు లక్ష రూపాయల పథకం పూర్తి వివరాలు మరియు అప్లికేషన్ విధానం
తెలంగాణలో బీసీలకు లక్ష రూపాయలు పథకానికి సంబంధించి పూర్తి వివరాలు మరియు అప్లికేషన్ ప్రాసెస్, లింక్ కింది పేజ్ లో చెక్ చేయండి
ఇది చదవండి : ఇకపై రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే ₹6000
ఇది చదవండి: ఎట్టకేలకు తెరుచుకున్న రైతుబంధు సైట్.. ఇలా అప్లై చేయండి
టెలిగ్రామ్ లో తెలంగాణ పథకాలకు సంబంధించి రెగ్యులర్ గా అప్డేట్స్ పొందటానికి ఇక్కడ క్లిక్ చేయండి
Leave a Reply