స్వాతంత్ర దినోత్సవం వేళ రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఒకే రోజులో ఏకంగా 9, 02,843 మందికి రుణమాఫీ జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
దీంతో మొత్తం లక్షలు లోపు ఉన్నటువంటి రుణమాఫీని పూర్తి చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి
తెలంగాణలో రెండో దశలో భాగంగా రుణమాఫీని పెండింగ్ ఉన్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించిన విధంగానే మొత్తం 5089 కోట్ల రూపాయలను ఒక రోజులో మాఫీ చేయడం జరిగింది. ఈ అమౌంట్ ను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతుల బ్యాంకు ఖాతాలో ఆర్థిక శాఖ జమ చేసింది.
దీంతో ఇప్పటివరకు 16.6 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని పూర్తి చేయడం జరిగింది.
మొత్తంగా 7753 కోట్ల రూపాయలను రుణమాఫీ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది.
2018 డిసెంబర్ వరకు ఉన్నటువంటి రుణాలకు సంబంధించి ఎన్నికల హామీలో భాగంగా లక్ష లోపు రుణమాఫీని చేస్తామని ప్రకటించగా, ఈ మేరకు తొలి దశలో భాగంగా కొంతమందికి రుణమాఫీ చేయగా ఆ తర్వాత కరోనా ప్రభావంతో మిగిలిన వారికి రుణమాఫీని పెండింగ్లో ఉంచింది. ప్రస్తుత ఆర్థిక స్థితి కొంత మెరుగుపడటంతో తిరిగి రుణమాఫీని అమలు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించడం జరిగింది. ఎందుకు అనుగుణంగానే ప్రస్తుతం రుణమాఫీని పెండింగ్ వారికి కూడా పూర్తి చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Leave a Reply