తెలంగాణలో జిహెచ్ఎంసి పరిధిలో నిర్మిస్తున్నటువంటి డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులు, పంపిణీ కి సంబంధించి నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవం రోజున కేటీఆర్ తొలి సంతకం చేశారు.
ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి మరియు ఇతర GHMC పరిధిలో ఎన్నో ఇల్లు నిర్మాణం పూర్తి అయ్యి, ఇప్పటివరకు పంపిణీ కాకుండా మిగిలి ఉన్నాయి. లబ్ధిదారులకు కేటాయింపులు మరియు పంపిణీ చాలా నెమ్మదిగా సాగుతుందని విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ మరియు GHMC పరిధిలోకి వచ్చే ప్రాంతాలలో లక్ష మంది పేదలకు త్వరితగతిన Double Bedroom ఇళ్లను పంపిణీ కి సంబందించి మార్గదర్శకాలను జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు KTR నూతన సచివాలయం భవనం నుంచి తొలి సంతకం చేశారు.
దీంతో త్వరలో దరఖాస్తు చేసుకొని పెండింగ్ లో ఉన్నటువంటి లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో పంపిణీలు చేపట్టే అవకాశం ఉంది.
Leave a Reply