విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై నోట్ బుక్స్ ఉచితం..ఎవరికంటే

విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై నోట్ బుక్స్ ఉచితం..ఎవరికంటే

జూన్ 12 నుంచి తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ తెలిపింది.

ఇకపై నోట్ బుక్స్ ఫ్రీ

ఇప్పటికే పాఠశాలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు నోట్ బుక్స్ మరియు సంబంధిత వస్తువులను కొనుగోలు చేసే కార్యక్రమంలో నిమగ్నమైన నేపథ్యంలో తెలంగాణ సర్కార్ తల్లిదండ్రులకు కొంత భారాన్ని తగ్గించింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజిబివి మరియు అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో విద్యార్థులందరికీ నోట్ బుక్స్ ను ఉచితంగా అందించనున్నారు.

అయితే ప్రస్తుతం 6-12 తరగతులు చదువుతున్న వారికి మాత్రమే అవకాశం

ఈ ఏడాది ఆరు నుంచి 12 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఈ నోట్ బుక్స్ ను ఉచితంగా అందించడం జరుగుతుంది. వచ్చే ఏడాది నుంచి ఒకటి నుంచి ఐదు తరగతులు వారికి కూడా నోట్ బుక్స్, వర్క్ బుక్స్ ఉచితంగా అందిస్తామని తెలంగాణ విద్యాశాఖ తెలిపింది.

ఏ తరగతుల వారికి ఎన్ని పంపిణీ చేస్తారు

6,7వ తరగతి చదివే విద్యార్థులకు 6 చోప్పున 200 పేజీల నోట్‌ బుక్స్ పంపిణీ చేస్తారు. 8వ తరగతి విద్యార్థులకు 7 నోట్‌బుక్స్‌ అందించనున్నారు. ఇక రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే 9, 10వ తరగతి విద్యార్థులకు 14 నోట్‌బుక్స్‌, ఇంటర్ విద్యార్థులకు 12 నోట్‌బుక్స్ అందిస్తారు. తరగతులు పెరిగే చొప్పున మరి అవసరాలకు అనుగుణంగా నోట్ బుక్స్ ని కూడా పెంచడం జరిగింది.

ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివే విద్యార్థులందరికీ యూనిఫామ్స్

నోట్ బుక్స్ మాత్రమే కాకుండా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివేటటువంటి విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫామ్ ను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయనుంది.

నోట్ బుక్స్ కోసం 56.24 కోట్లు ఖర్చవుతుందని సర్కార్ అంచనా వేస్తుంది. ఇక మొత్తంగా 1,17,88,699 నోట్‌ పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. ఇక యూనిఫార్మ్స్ కోసం 150 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

You cannot copy content of this page