దివ్యాంగుల పెన్షన్ పెంపు..ఇకపై 4116 ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటన

దివ్యాంగుల పెన్షన్ పెంపు..ఇకపై 4116 ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటన

తెలంగాణలో దివ్యాంగుల పెన్షన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెయ్యి రూపాయలు మేర పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు గుడ్ న్యూస్ తెలిపారు.

మంచిర్యాలలో జరిగిన ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి మేరకు ప్రకటన చేయడం జరిగింది. ఇదే వేదిక నుంచి బీసీలకు లక్ష రూపాయల పథకం కి కూడా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు.

దీంతో ప్రస్తుతం 3116 రూపాయలుగా ఉన్నటువంటి దివ్యాంగుల పెన్షన్ ను వెయ్యి రూపాయలు పెంచి 4116 రూపాయలు అందించినున్నట్లు తెలిపారు. వచ్చే నెల అనగా జూలై నెల నుంచి ఈ పెంచిన పెంపు వర్తిస్తుందని ప్రకటించారు.

మంచిర్యాల గ‌డ్డ నుంచి ఈ విషయాన్ని ప్రకటించాలనే ఇప్పటి వరకు స‌స్పెన్ష‌న్‌లో పెట్టానని సీఎం అన్నారు. అందరి సంక్షేమాన్ని , మంచిని చూసుకుంటున్నామని అన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత భారత ప్రభుత్వ హయాంలో సంక్షేమం మరియు వ్యవసాయంలో మెరుగ్గా ఉన్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

You cannot copy content of this page