తెలంగాణలో బీడీ కార్మికులకు ఇస్తున్నటువంటి సామాజిక పెన్షన్ 2016 రూపాయలను ఇకపై బీడీ టేకేదారులకు కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
బీడీ టేకేదారులు అంటే ఎవరు?
బీడీ కార్మికులు చేసినటువంటి బీడీలను లెక్కించి ప్యాకింగ్ చేసే వర్కర్స్ ను బీడీ టేకేదారులు అంటారు.
మంత్రివర్గ సమావేశంలో వీరికి కూడా 2016 రూపాయల ఆసరా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. త్వరలో ఇందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు తెలిపారు.
ఇటీవల దివ్యాంగుల పెన్షన్ 4016 రూపాయలకు పెంచినటువంటి ప్రభుత్వం, అనాధ పిల్లలను కూడా పూర్తిగా దత్తత తీసుకోనున్నట్లు ప్రకటించింది. మరో వైపు 43,373 మంది ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఏడాది లో ఇటువంటి కీలక నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం గమనార్హం.
Leave a Reply