రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇంకా పెండింగ్ ఉన్నటువంటి రైతు రుణమాఫీని 45 రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
ప్రగతిభవన్ లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మరియు ఇతర అధికారులతో భేటీ అయిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఆగస్టు 3 నుంచి రుణమాఫీ
తెలంగాణలో 2018 లో హామీ ఇచ్చిన మేరకు రెండో విడత అధికారం చేపట్టిన తర్వాత లక్ష రూపాయల వరకు రైతుల రుణాలను మాఫీ చేస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించగా ఇంకా కొంతమందికి పెండింగ్ ఉంది.
కరుణ మరియు ఆర్థిక వెసులుబాటు లేక పూర్తిగా అమలు చేయలేకపోయామని, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడిన నేపథ్యంలో రుణ మాఫీ ఇంకా మిగిలి ఉన్నవారికి ఆగస్టు 3 నుంచి రుణమాఫీ ప్రక్రియ తిరిగి ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
మొత్తం 19 వేల కోట్ల రుణమాఫీ
గతంలో మాఫీ చేసిన అమౌంట్ పోగా ఇంకా 19 వేల కోట్ల మేర రుణమాఫీ చేయాల్సి ఉందని, ఈ అమౌంట్ ను రైతుబంధు తరహాలో దశలవారీగా మాఫీ చేస్తామని సీఎం అన్నారు. మొత్తం 45 రోజుల్లో అనగా ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ రెండో వారం నాటికి ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Leave a Reply