ఎన్నికల ఏడాది కెసిఆర్ దివ్యంగులకు మరో గుడ్ న్యూస్ తెలిపారు. ఇప్పటికే దివ్యాంగుల పెన్షన్ ను వెయ్యి పెంచి 4016 కు పెంచిన సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
గృహ లక్ష్మి పథకంలో దివ్యాంగులకు రిజర్వేషన్లు
తెలంగాణలో సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు మూడు లక్షల రూపాయలను మూడు దఫాలలో ఇవ్వనున్న గృహలక్ష్మి పథకంలో ఇక పై దివ్యాంగులకు కూడా రిజర్వేషన్లను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
దివ్యాంగులకు గృహ లక్ష్మీ పథకంలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు సవరించడం జరిగింది. సవరించిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీచేసింది.
ఇప్పటికే గృహ లక్ష్మి పథకం లో భాగంగా ఎస్సీ లకు 20% , ఎస్టీ లకు 10% మరియు బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించిన విషయం తెలిసిందే. ఈ కొత్త పథకం సంబంధించి 12 వేల కోట్లు వ్యయం అవుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది.
Leave a Reply