ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడ్కో ఇళ్లపై రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్నటువంటి తీడ్కో ఇళ్లను డిసెంబర్ 2025 నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇచ్చాపురం పర్యటనలో భాగంగా ఆయన మీడియాకు ఈ విధంగా తెలిపారు.
డిసెంబర్ నాటికి 70 వేల ఇల్లు పూర్తి
డిసెంబర్ నాటికి వివిధ దశల్లో ఉన్నటువంటి 70 వేల ఇళ్లను త్వరితగతిన నిర్మించి లబ్ధిదారులకు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు టిడ్కో చైర్మెన్ అజయ్ కుమార్ వెల్లడించారు. అదేవిధంగా జగనన్న కాలనీలలో స్థలం పొందిన లబ్ధిదారులు కొంతమంది తమకు కాలనీకి బదులు టిడ్కో ఇల్లు కేటాయించమని అడుగుతున్న నేపథ్యంలో అవి కూడా పరిశీలించి సరైన యాక్షన్ తీసుకుంటామని ఆయన తెలిపారు. అదేవిధంగా మే 31 వరకు ఉన్న లబ్ధిదారుల బ్యాంకు రుణాలకు సంబంధించి నెలవారీ 185 కోట్ల వాయిదాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆయన అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా టీడ్కో ఇళ్లకు సంబంధించి వివిధ దశల్లో ఉన్నటువంటి నిర్మాణాలు మరియు మరమ్మతులు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి కూడా పలు టిడ్కో ఇళ్ల సముదాయాల్లో ప్రభుత్వం పనులు చేపడుతుంది.

2027 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యంలో పట్టణాల్లో ఉండే వారికి టిడ్కో ఇల్లు గ్రామాల్లో ఉండే వారికి 3 సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే.
Leave a Reply