రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా TIDCO ఇళ్ళను పంపిణీ చేస్తున్నటువంటి ప్రభుత్వం తాజాగా కృష్ణా జిల్లా గుడివాడ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చేతుల మీదగా 8,912 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.
8,912 టిడ్కో ఇల్లు, మరో 7728 ఇళ్ల స్థలాలు
కృష్ణాజిల్లా గుడివాడ మున్సిపాలిటీ మల్లాయపాలెంలో 77 ఎకరాలలో ఒకే లేఔట్ లో పూర్తయినటువంటి 8912 tidco ఇళ్ళను అక్కడే మరో 178.63 ఎకరాల్లో మరో 7728 ఇళ్ల పట్టాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేయడం జరిగింది.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వం నిర్మించిన ఈ ఇళ్లను 1,43,600 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. రూపాయికే వీరికి రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది.
టిడికో ఇల్లు అంటే ఏమిటి?
గత ప్రభుత్వ హయాంలో పేదల కోసం రాష్ట్రవ్యాప్తంగా అపార్ట్మెంట్ తరహాలో 300 చదరపు గజాల ఇళ్లను అప్పటి ప్రభుత్వం నిర్మించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 7 లక్షల ఇళ్లను నిర్మించడం జరిగింది. వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్రోగ్రాం ద్వారా ఈ ఇళ్లను నిర్మించారు.
అయితే వాటిని పంపిణీ చేస్తే లోపు ప్రభుత్వం మారడంతో కొన్నాళ్ళ పాటు ఆ ఇళ్లు అలానే ఉంచడం జరిగింది. వీటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఇళ్లను త్వరితగతిన పంపిణీ చేయాలని కోరడం జరిగింది.
వీటికి మరమ్మతులు చేసి మరికొన్ని సదుపాయాలు కల్పించి ప్రస్తుత ప్రభుత్వం దశలవారీగా వీటిని పంపిణీ చేస్తూ వస్తుంది.
ఇప్పటికే మూడు దశలలో గత సంవత్సరం ఇలానే పంపిణీ చేసినటువంటి ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా ముమ్మరంగా ఇళ్ల పంపిణీ చేపడుతుంది.
Leave a Reply