రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వర్షాలు వరదలపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో భాగంగా వరద ప్రాంతాల్లో పర్యటించాలని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
క్షేత్రస్థాయిలో వరద ముంపు ప్రాంతాల్లో సందర్శించి ప్రజలకు అండగా నిలవాలని సీఎం జగన్ ఆదేశించారు
మరోవైపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎం జగన్ వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు మరియు పునరావాస కేంద్రాల ఏర్పాటు గురించి సమీక్షించారు.
వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు ముమ్మరం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
బాధితులను సహాయ శిబిరాల నుంచి ఇళ్లకు పంపేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ. 2వేల చొప్పున, వ్యక్తులకైతే రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలని సూచించారు.
కచ్చా ఇళ్లు మరమ్మతులు చేసుకోవడానికి రూ.10,000 తక్షణమే అందించాలని చెప్పారు. 25 కేజీల బియ్యం, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు, కిలో పామాయిల్ ఇవ్వాలన్నారు.
Leave a Reply