అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మరో కానుక ప్రకటించింది.
ఇప్పటికే మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వారోత్సవాలు, మహిళా సాధికారత కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం , తాజాగా మహిళలకు 2022 23 ఆర్థిక సంవత్సరానికి గాను 750 కోట్ల మేర వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తూ నిధులు విడుదల చేసింది.
ఇందులో గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు 500 కోట్లు మరియు పట్టణ స్వయం సహాయక సంఘాలకు 250 కోట్ల మేర నిధులను కేటాయించింది.
వడ్డీ లేని రుణాల పథకం ఎవరికి వర్తిస్తుంది ?
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నుంచి ఈ పథకం అమలు అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను ఇస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,31,025 స్వయం సహాయక సంఘాలు ఉంటే , వీటిలో 46,10,504 మంది సభ్యులుగా ఉన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ [ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టి ] సర్ప ద్వారా ఈ పథకాన్ని పరివేక్షిస్తున్నారు. ఇక పట్టణాల్లో అయితే మెప్మా ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
వడ్డీ లేని రుణాలు ఏ విధంగా పనిచేస్తాయి?
ముందుగా రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలు ఏవైనా బ్యాంకుల నుంచి లోన్ అనగా రుణం తీసుకొని సకాలంలో వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఈ విధంగా సకాలంలో చెల్లించిన రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు తిరిగి వడ్డీ అమౌంట్ ను జమ చేస్తుంది. ఇందుకుగాను ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 750 కోట్ల రూపాయలను విడుదల చేసింది. తద్వారా మరింత మంది ఖాతాల్లో ఈ వడ్డీ రాయితీ అమౌంట్ జమ కానుంది.
ఈ ఏడాది మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరింత ఆర్పాటంగా నిర్వహిస్తుంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వారోత్సవాలను, మహిళా సాధికారత కార్యక్రమాలను , పారిశ్రామిక వేత్తలు గా మహిళలను తీర్చిదిద్దేందుకు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు కూడా ప్రకటించడం జరిగింది. మహిళలకు ఇదే రోజున వడ్డీ లేని రుణాలను మంజూరు చేయనున్నట్లు ఇదివరకే మంత్రులు ప్రకటించిన నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం నిధులు కేటాయించి మహిళలకు కానుకను ప్రకటించడం జరిగింది.
Leave a Reply