తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు గుడ్ న్యూస్ తెలిపింది.
కులవృత్తులు, చేతి వృత్తులు చేసుకునేటటువంటి బీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించనుంది.
ఇటువంటి వారికి ఎటువంటి పుచ్చికత్తు లేకుండా లక్ష రూపాయలను పూర్తి సబ్సిడీతో అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
లబ్ధిదారులు ఆన్లైన్ లోనే సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ లింక్ పేజ్ దిగువున ఇవ్వబడింది.
బీసీలకు లక్ష రూపాయలు పథకం అర్హతలు ఏంటి
లబ్ధిదారులు బిసి కులానికి చెందిన వారై ఉండాలి
బీసీ కులానికి చెందిన కులవృత్తులు లేదా చేతివృత్తులపై ఆధారపడిన వారై ఉండాలి
వయసు 18 నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉండాలి
గ్రామాల్లో వార్షిక కుటుంబ ఆదాయం 1.5 లక్షల్లోపు ఉండాలి అదే పట్టణాలలో అయితే రెండు లక్షల లోపు ఆదాయం ఉండాలి
గత ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి వివిధ పథకాల రూపంలో 50 వేలకు మించి లబ్ది పొందిన వారు అనర్హులు
అమౌంట్ ఎప్పుడు ఇస్తారు
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 9న తొలి విడత పంపిణీ ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 1200 నుంచి 1500 మందికి లబ్ది చేకూర్చే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఇప్పటికే దళిత బంధు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దళితులకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్న విషయం తెలిసిందే, రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మరి కొన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు ఇతర సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెడుతుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం కులవృత్తుల మీద ఆధారపడుతున్నటువంటి బీసీలకు కూడా లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే రజక, నాయి బ్రాహ్మణ, కంసాలి, కుమ్మరి వంటి కుల ఆధారిత పనులు చేస్తుంటారో వారికి మేలు జరుగుతుంది.
ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ? ఎప్పటి వరకు గడువు?
అర్హత ఉన్న బీసీ కుల వృత్తుల వారు, చేతి వృత్తుల వారు కింది ఆన్లైన్ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
లబ్ధిదారుల వివరాలు, ఫోటో, ఆధార్, కుల ధృవీకరణ పత్రం వంటివి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 20 వరకు అవకాశం కల్పించారు.
Leave a Reply