బీసీలకు లక్ష రూపాయల పంపిణీ పథకం ప్రారంభం.ఇకపై ప్రతినెలా 15 న అమౌంట్

బీసీలకు లక్ష రూపాయల పంపిణీ పథకం ప్రారంభం.ఇకపై ప్రతినెలా 15 న అమౌంట్

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న బీసీలకు లక్ష రూపాయల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ లాంచనంగా ప్రారంభించారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ దినోత్సవం సందర్భంగా మంచిర్యాలలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగింది. తొలుత లాంచన ప్రాయంగా ఆరుగురు లబ్ధిదారులకు సీఎం చేతుల మీదుగా లక్ష రూపాయలు చొప్పున నగదు అందించారు.

ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి లబ్ధిదారులకు లక్ష రూపాయల నగదును అందించడం జరుగుతుంది.

ఇకపై ప్రతినెలా 15వ తేదీన అమౌంట్

ఈనెల బీసీలకు లక్ష రూపాయలు పథకానికి సంబంధించి బీసీ కుల వృత్తులు చేతి వృత్తుల వారు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జూన్ 20 వరకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. లబ్ధిదారులను ఎంపిక చేసి విడతల వారీగా వీరికి సహాయం అందించనున్నారు.

ఈ విధంగా ప్రతి నెల ప్రకటించిన జాబితాకి సంబంధించి అదే నెలలో 15వ తేదీన లబ్ధిదారులకు లక్ష రూపాయలు పంపిణీ చేయనున్నారు.

బీసీలకు లక్ష రూపాయల పథకం అర్హతలు మరియు అప్లికేషన్ విధానం

బీసీలలో చేతివృత్తులు కులవృత్తులు చేసుకునేటటువంటి వారి కోసం ప్రవేశపెట్టిన బీసీలకు లక్ష రూపాయల పథకానికి సంబంధించి అర్హతలు మరియు అప్లికేషన్ పూర్తి విధానం కింది లింకు ద్వారా చెక్ చేయండి

బీసీలకు లక్ష రూపాయల పథకం కులాల వారీగా లిస్ట్

ఈ పథకానికి సంబంధించి ఏ కులాల వారికి తొలి దశలో లక్ష రూపాయలు పంపిణీ చేస్తారో ప్రభుత్వం ప్రకటించింది. ఏ కులాల వారికి ఇది వర్తిస్తుందో కింది లింకు ద్వారా చెక్ చేయండి.

You cannot copy content of this page