Telangana e-auction : రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి భూముల వేలానికి నోటిఫికషన్, దరఖాస్తు చేసుకోండి

Telangana e-auction : రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి భూముల వేలానికి నోటిఫికషన్, దరఖాస్తు చేసుకోండి

హైదరాబాద్ GHMC చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో భూముల వేలాలను నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మూడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి HMDA భూముల వేలానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మూడు జిల్లాలకు సంబంధించి భూముల వేలానికి నోటిఫికేషన్

హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మరియు సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి భూముల వేలానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

రంగారెడ్డి జిల్లా పరిధిలో : గండిపేట పరిధిలో ఉన్నటువంటి బైరాగి గూడ, మంచిరేవుల, పీరం చెరువు భూములకు అదే విధంగా శేర్లింగంపల్లి పరిధిలో ఉన్నటువంటి నల్లగండ్ల, చందానగర్ భూములకు మరియు రాజేందర్ నగర్ పరిధిలో ఉన్నటువంటి బుద్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి భూములకు వేలం నిర్వహిస్తున్నారు.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో : బాచుపల్లి లో పలు భూములకు, దుండిగల్ పరిధిలో గండి మైసమ్మ భూములకు మేడిపల్లి పరిధిలో చెంగిచెర్ల మరియు కుత్బుల్లాపూర్ పరిధిలో సూరారం ప్రాంతాల్లో భూములకు వేలం నిర్వహిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా పరిధిలో: ఆర్ సి పురం రామచంద్రపురం పరిధిలో ఉన్నటువంటి వెలిమల , అమీన్పూర్ పరిధిలో ఉన్నటువంటి అమీన్పూర్ మరియు కిష్టారెడ్డిపేట, పటాన్చెరు పరిధిలో ఉన్నటువంటి రామేశ్వరం బండ,నందిగామ, నందిఘన్ పూర్ భూములకు వేలం నిర్వహిస్తున్నారు

దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 16 వరకు గడువు

వేలంలో పాల్గొనదలచిన వారు 16 ఆగస్టు 2023 సాయంత్రం 5 గంటల లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Official link :

రిజిస్ట్రేషన్ లింక్:

ఈ భూములకు ఆగస్టు 18 నుంచి వేలం నిర్వహిస్తారు.

చదరపు గజానికి కనిష్టంగా 12 వేలు , గరిష్టంగా 65 వేలుగా ఈ భూములకు నిర్ణయించడం జరిగింది.

Click here to Share

You cannot copy content of this page