తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల (Indiramma Chiralu) పంపిణీ కార్యక్రమం గురువారం నుంచి డిసెంబర్ 9 వరకు ప్రతి గ్రామంలో కొనసాగుతుంది. మరి చీరలు ఎవరికి ఇస్తారు, పట్టణాల్లో ఎప్పుడు పంపిణీ ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ చూపాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రారంభమైన ఇందిరమ్మ చీరల పంపిణీ, మార్గ దర్శకాలు ఇవే.. – Indiramma Sarees Distribution Scheme in Telangana
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్ నుంచి ఈ పథకానికి శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి, రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
గురువారం అనగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ కొనసాగుతుంది. పట్టణాల్లో అయితే మార్చి 1 నుంచి మార్చి 8 వరకు పంపిణీ ఉంటుంది.

Indiramma Chiralu Guidelines ఇవే..
- తెలంగాణలో నివసిస్తూ 18 ఏళ్లు నిండి ఉండాలి.
- 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లు ఉన్నవారికి త్వరలో సల్వార్ కమీజ్ లేదా లంగా ఓణి పంపిణీ
- రెండు దశల్లో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ఉంటుంది
- మొదటి దశలో నవంబర్ 20 నుంచి డిసెంబర్ 9 వరకు గ్రామాల్లో 65 లక్షల చీరలు పంపిణీ
- పట్టణాల్లో మార్చి 1 నుంచి 8 వరకు పంపిణీ
- మహిళలు తప్పనిసరిగా ఆధార్ చూపాలి. చీర పంపిణీ చేసేటపుడు ఫోటో తీయడం జరుగుతుంది. పెన్షనర్ల యాప్ ను ఇందుకోసం ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది.
- మహిళా సంఘాల సభ్యులు అయితే నేరుగా ఫోటో తీసుకొని ఆధార్ నమోదు చేసుకొని ఇస్తారు, సభ్యులు కాకపోతే సభ్యత్వం కూడా నమోదు చేయడం జరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో చీరలతోపాటు మహిళా సంఘాల్లో సభ్యత్వం కూడా లభిస్తుంది.
- తెలంగాణ సంప్రదాయం ప్రకారం మహిళలకు బొట్టుపెట్టి చీర అందించడం జరుగుతుంది.




