గృహ లక్ష్మి పై హైకోర్టు స్టే, కారణం ఇదే

గృహ లక్ష్మి పై హైకోర్టు స్టే, కారణం ఇదే

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకానికి సంబంధించి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గృహలక్ష్మి పథకం అమలుపై స్టే కీలక ఉత్తర్వులు చారి విధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

గిరిజనేతురులకు తమ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి గృహలక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయం చేస్తున్నారని, ఆదివాసీ సేన ప్రధాన కార్యదర్శి సాయిబాబు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇందులో ఆయన గిరిజన ప్రాంతాల్లో ఐదో షెడ్యూల్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని కోరడం జరిగింది.

పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గృహ లక్ష్మీ పథకం అమలు నిలిపివేయాలని స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక పిటిషన్ కి సంబంధించి తదుపరి విచారణను నవంబర్ 6 వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

గృహ లక్ష్మీ పథకం ద్వారా తెలంగాణలో పక్కా ఇల్లు లేనటువంటి పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణాల కోసం 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.

Click here to Share

You cannot copy content of this page