తెలంగాణ ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు శుభవార్త చెప్పింది. సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. దీనికి గృహలక్ష్మి పథకం అని పేరు పెడుతున్నామని, దీని కింద ప్రతి నియోజకవర్గంలో 3000 ఇళ్ళ చొప్పున 4 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. అర్హులకు మూడు లక్షలను మూడు విడతల్లో ఇస్తామన్నారు. అలాగే గృహ నిర్మాణ సంస్థ ద్వారా గతంలో నిర్మించుకున్న ఇల్ల అప్పులను రద్దు చేస్తున్నట్లు హరీష్ రావు ప్రకటించారు
ఈ పథకానికి రూ.12వేలకోట్లు ఖర్చవుతాయని, ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.
మంజూరు చేసే ఇండ్లన్నీ ఆ ఇంటికి సంబంధించిన ఇల్లాలిపైనే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత కాంగ్రెస్, తెలుగుదేశం హయాంలో ఇచ్చిన రూ.40వేలు, రూ.60వేలల్లో అప్పులు ఉండేవి. గతంలో అప్పులన్నీ మాఫీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు రూ.4వేలకోట్లు పేదలపై అప్పులుంటే.. ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం. గతంలో పేదల వర్గాలు కట్టుకున్న ఇండ్లను మాఫీ చేయడమే కాదు.. ఇవాళ ఎన్నో రోజులుగా ప్రజలు ఎదురు చూస్తుండగా.. 4లక్షల ఇండ్ల నిర్మాణానికి చర్యలు.
అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నవారికి
జీవో 58, 59 కింద పూర్తి హక్కులు కల్పిస్తున్నట్లు
మంత్రి హరీష్ రావు తెలిపారు. అందుకు 2014
వరకే గతంలో కటాఫ్ డేట్ ఉండగా.. ఇప్పుడు దాన్ని 2020కి
మారుస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నట్లు
చెప్పారు. దరఖాస్తు చేసుకోవడానికి కూడా నెల రోజులు
గడువు ఇస్తున్నామన్నారు. మరింత మంది పేదలకు
లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని
వెల్లడించారు.
Leave a Reply