తెలంగాణ నోటరీ ఆస్తుల రిజిస్ట్రేషన్ కి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పట్టణాలు మరియు నగరాలలో నోటరీ ద్వారా కొనుగోలు చేస్తున్నటువంటి వ్యవసాయ ఇతర ఆస్తుల రెగ్యులరైజేషన్ కొరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ విధంగా దరఖాస్తు చేయండి [ Registration of Notary Property in Telangana]
నోటరీ ఆస్తుల రెగ్యులరైజేషన్ కొరకు దరఖాస్తును మీసేవ కేంద్రాలలో సమర్పించవచ్చు.
ఇందుకు దరఖాస్తు తో పాటు కింద ఇవ్వబడిన డాక్యుమెంట్స్ జత చేయాల్సి ఉంటుంది
- నోటరీ చేసుకున్న డాక్యుమెంట్
- లింక్ డాక్యుమెంట్లు
- ప్రాపర్టీ టాక్స్ రసీదు
- కరెంట్ బిల్లు
- వాటర్ బిల్లు
- ఇంకా ఏవైనా ఇతర డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే జత చేయాలి
125 గజాలు లోపు స్థలం ఉంటే ఉచితంగా రెగ్యులరైజేషన్ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అంతకుమించి స్థలమున్నవారికి మార్కెట్ రేట్ ప్రకారం స్టాంప్ డ్యూటీ చెల్లించి రేగులరైజేషన్ చేయడం జరుగుతుంది.
Leave a Reply