తెలంగాణలో పేదల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
నూతన సచివాలయంలో అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్, GHMC పరిధిలో GO 58 59 కింద ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు గడువును మరో నెల రోజులపాటు పొడిగించాలని అధికారులను ఆదేశించారు.
ఏప్రిల్ 30 తో ఈ గడువు ముగియగా తాజా నిర్ణయంతో మరో నెల రోజులు అనగా మే 31 వరకు లబ్ధిదారులు తమ స్థలాలను క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు.
అసలు జీవో నెంబర్ 58 59 అంటే ఏమిటి?
GO Number 58 అంటే ఏమిటి?
ఎటువంటి అభ్యంతరాలు లేనటువంటి ప్రభుత్వ భూముల్లో ఎవరైనా దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి BPL కుటుంబాలు ఎవరైనా చాలా ఏళ్లుగా నివాసం ఉంటున్నట్లయితే అటువంటి వారికి 125 చదరపు మీటర్ల భూమి వరకు హక్కులు కల్పించాలని జారీచేసిన జీవోనే 58
GO Number 59 అంటే ఏమిటి?
ఎటువంటి అభ్యంతరాలు లేనటువంటి ప్రభుత్వ భూములలో లేదా మిగులు భూములలో ఉండే ఆక్రమణలకు సంబంధించి క్రమబద్దీకరణ కోసం తీసుకువచ్చిన జీవో ఇది. దీని ద్వారా ఆక్రమించిన వ్యక్తి నుంచి పలు ఇన్స్టాల్మెంట్స్ ద్వారా అమౌంట్ కట్టించుకొని వారికి హక్కులను కల్పిస్తారు.
Download GO Number 58 59 sample application forms from below links
Leave a Reply