తెలంగాణ రాష్ట్రం ఏర్పడి జూన్ 2 నాటికి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని పదో ఏటా అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊరువాడ 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాల పేరుతో సంబరాలను నిర్వహిస్తుంది.
జూన్ 2 2023 నుంచి జూన్ 22 వరకు ఈ సంబరాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. జూన్ రెండవ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవం పూర్తయిన తర్వాత మరుసటి రోజు అనగా జూన్ 3 నుంచి 22 వరకు ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పండుగలా జరపనుంది.
ఏ రోజు ఏ సంబురాలు చేస్తారు? రోజు వారి ప్రత్యేకత ఏంటో చూడండి
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటాము. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది వేడుకలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజున ప్రారంభిస్తారు. జూన్ 2న హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్మారకస్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారు.అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఆవరణలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారు. జిల్లాల్లో జరిగే వేడుకల్లో మంత్రులు పాల్గొంటారు.
జూన్ 3వ తేదీని (శనివారం) తెలంగాణ రైతు దినోత్సవంగా జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతు వేదికల ద్వారా పలు కార్యక్రమాలను నిర్వహించనుంది. ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా మరియు ఇతర పథకాలు తో రాష్ట్ర వ్యవసాయ రంగం సాధించిన విజయాలను ఈ కార్యక్రమాల ద్వారా ప్రచారం చేయనున్నారు. ఇందులో భాగంగా రైతులతో కలిసి సామూహిక భోజనాలలో ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు.
“సేఫ్టీ డే” (సురక్షా దినోత్సవం) జూన్ 4వ తేదీ (ఆదివారం) జరుపుకుంటారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషి, స్నేహపూర్వక పోలీసు విధానం, రాష్ట్ర, జిల్లా స్థాయిలో రాష్ట్ర పోలీసు శాఖ సమర్ధవంతమైన సేవలను వివరించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
జూన్ 5వ తేదీ (సోమవారం) “తెలంగాణ విద్యుత్ విజయోత్సవం” పేరుతో సమావేశాలు నిర్వహిస్తారు. నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఉంటాయి. విద్యుత్ రంగంలో రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పును సమావేశాల్లో వివరిస్తారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది. అదే రోజు సింగరేణి వేడుకలు కూడా జరగనున్నాయి.
తెలంగాణ ఇండస్ట్రియల్ గ్రోత్ ఫెస్టివల్ జూన్ 6న జరగనుంది. పారిశ్రామిక ప్రాంతాలు, ఐటీ కారిడార్లలో సమావేశాలు నిర్వహించనున్నారు.
జూన్ 7వ తేదీని “సాగునీటి దినోత్సవం”గా జరుపుకుంటారు.. నీటిపారుదల రంగంలో సాధించిన ప్రగతిని వివరించేందుకు ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఊరూరా చెరువుల పండుగ జూన్ 8న ఉంటుంది. ఈ “ఊరురా చెరువుల పండుగ” ద్వారా బతుకమ్మ, బోనాలు సహా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి సహా ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించనున్నారు.
జూన్ 10న సుపరిపాలన దినోత్సవం గా రాష్ట్ర ప్రభుత్వం జరుపుకుంటుంది. ఈ రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యవస్థలను మరింత అందుబాటులోకి తీసుకురావడం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ రోజున తెలంగాణ సాహిత్య దినోత్సవం పేరున ప్రభుత్వం ఉత్సవాలను నిర్వహిస్తుంది. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు కవితల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు.
రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తెలంగాణ రన్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
జూన్ 13 న తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటాము. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అధికారులు ప్రజలకు వివరిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య రంగంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయనున్నారు.
ఈ రోజున దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ గ్రామాలు సాధించిన ప్రగతిని ప్రభుత్వం ప్రదర్శించనుంది.
ఈ రోజున ప్రతి మున్సిపాలిటీలో సాధించిన ప్రగతి, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను కార్యక్రమాల్లో వివరిస్తారు.
కొత్తగా ఏర్పాటైన గిరిజన గ్రామాల్లో ఈ రోజున సభలు నిర్వహిస్తారు. గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరిస్తారు.
జూన్ 18న తెలంగాణ తాగునీటి దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మిషన్ భగీరథ ద్వారా తెలంగాణను 100% తాగునీటి సరఫరా రాష్ట్రంగా మార్చడం పై సమావేశాలు నిర్వహించి ప్రజలకు వివరిస్తారు.
ఈరోజున రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున జరగనుంది.
తెలంగాణ విద్యా దినోత్సవం సందర్భంగా ఈరోజు న 10,000 లైబ్రరీలు, 1,600 డిజిటల్ క్లాస్‌రూమ్‌లను కొత్తగా ప్రారంభించనున్నారు. విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహించనున్నారు.
తెలంగాణ లౌకికవాధాన్ని ప్రతిభింబించెలా దేవాలయాలు, మసీదులు, చర్చిలు మరియు ఇతర మత ప్రార్థనా స్థలాల వద్ద వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.
తెలంగాణ సాధన కోసం అసువులు బాసిన అమరవీరుల స్మారక స్తూపాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించడం జరిగింది. 6000 మందితో భారీ ర్యాలీ ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది.
అమరవీరుల స్మారక స్థూపం ఆవిర్భావంతో దశాబ్ది ఉత్సవాలు ముగిసాయి.
Leave a Reply