వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల.. పథకాల పూర్తి వివరాలు

వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల..  పథకాల పూర్తి వివరాలు

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. 2024 ఎన్నికలకు సంబంధించి రెండు పేజీలతో వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉన్న సంక్షేమ పథకాలకే నిధుల పెంపుపై జగన్ ప్రధానంగా దృష్టి సారించారు. తొమ్మిది ముఖ్యమైన హామీలతో మేనిఫెస్టోను రూపొందించారు.

వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో ముఖ్యంశాలు

  • అమ్మ ఒడి, విద్యాకానుక, కాపు నేస్తం, మహిళలకు వైఎస్సార్‌ చేయూత తదితర పథకాల కొనసాగింపు
  • అమ్మ ఒడి పథకం కింద ఇస్తున్న రూ.15వేలను రూ.17వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
  • వైఎస్సార్‌ చేయూత పథకం 8 విడతల్లో రూ.75 వేల నుంచి రూ. లక్షా 50 వేలకు పెంపు
  • రెండు విడతల్లో పింఛన్లు రూ.3500 చెల్లిస్తామని ప్రకటించారు (2028 జనవరిలో రూ.25, 2029 జనవరిలో 2029లో పెంపు)
  • వైఎస్సార్ కాపు నేస్తం నాలుగు దశల్లో రూ.60 వేల నుంచి రూ.లక్షా 20వేలకు పెంపు
  • వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింది రూ.3 లక్షల వరకు రుణాలు ఇస్తామని ప్రకటించారు
  • వైఎస్సార్ ఈబీసీ నేస్తం నాలుగు విడతల్లో రూ.45వేల నుంచి రూ. లక్షా 5 వేలకు పెంపు
  • కళ్యాణ మస్తు, షాదీ తోఫా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు
  • వైద్యం, ఆరోగ్యశ్రీని మరింతగా విస్తరిస్తామన్న ప్రకటించారు
  • రైతు భరోసా pm కిసాన్ కింద ఇచ్చే సొమ్ము రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంపు (కౌలు రైతులకు రైతు భరోసా కొనసాగింపు)
  • అర్హులై ఇళ్ల స్థలాలు లేనివాళ్లందరికీ ఇళ్లు.. ఇళ్ల పట్టాల కొనసాగింపు
  • ఆటో, ట్యాక్సీ, లారీలు కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ ప్రకటించారు
  • ఆటో, ట్యాక్సీ, లారీ డ్రైవర్లకు రూ.10 లక్షల ప్రమాద బీమా అమలు
  • లారీ డ్రైవర్లు, టిప్పర్‌ డ్రైవర్లకు కూడా వాహన మిత్ర వర్తింపు
  • వాహన మిత్ర ను ఐదేళ్లలో రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంపు
  • చేనేతలకు ఏడాదికి రూ.24 వేలు చొప్పున, ఐదేళ్లలో రూ.లక్షా 20 వేలు
  • నాడు-నేడు..ట్యాబ్‌ల పంపిణీ కొనసాగింపు, 2025 నుంచి ఒకటో తరగతి ఐబీ సిలబస్‌
  • ప్రతీ నియోజకవర్గంలో స్కిల్‌ హబ్‌.. జిల్లాకో స్కిల్‌డెవలప్‌మెంట్‌ కాలేజీ.. తిరుపతిలో స్కిల్‌ యూనివర్సిటీ
  • స్విగ్గీ, జొమాటో లాంటి డెలివరీ కంపెనీల్లో పని చేస్తున్న గిగా సెక్టార్‌ ఉద్యోగులు ప్రమాదవశాత్తూ మరణిస్తే వైఎస్సార్‌ బీమా వర్తింపు
  • ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కూడా విదేశాల్లో చదువుకునేందుకు రుణాలు
  • ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్‌

సీఎం జగన్ హామీలు

  • మళ్లీ అధికారంలోకి రాగానే విశాఖను రాజధానిని చేస్తాం
  • రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజిన్‌గా విశాఖను తీర్చి దిద్దుతాం
  • అమరావతిని శాసనరాజధానిగా చేస్తాం
  • కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తాం

You cannot copy content of this page