ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది.
వైఎస్సార్ రైతు భరోసా పథకం ఈ ఏడాది మూడో విడత అమౌంట్ ను ఈ నెల 28న క్యాంపు కార్యాలయం నుండి విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.
అదే రోజు పీఎం కిసాన్ నిధులను కూడా ప్రధాన మంత్రి విడుదల చేయనున్నారు
RYTHU BHAROSA DATE : 28 February 2024
ఎంత అమౌంట్ జమ అవుతుంది?
ఈ ఏడాదికి సంబంధించి ఈ నెల మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా అమౌంట్ , PM కిసాన్ అమౌంట్ కింద 2000 కేంద్రం జమ చేస్తుంది. మొత్తంగా 2000 రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాలో జమ చేయనున్నాయి.
మొదటి విడత గా 7500, రెండో విడత 4000 ఇక ఈ నెల మూడో విడత గా 2000 ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే.
వైయస్సార్ రైతు భరోసా కోసం కొత్త రిజిస్ట్రేషన్ లను రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. వీరికి కూడా తాజాగా విడుదల కానున్నటువంటి అమౌంట్ ను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది.
ఇక కేంద్ర ప్రభుత్వం జమ చేసేటటువంటి పీఎం కిసాన్ అమౌంట్ నిధులు గత విడతలో మాదిరిగానే ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే జమ అవుతుంది. ఒకవేళ ఈ కేవైసీ పూర్తి చేయని కారణంగా గత విడత అమౌంట్ పడని వారికి ఈ విడత అమౌంట్ తో కలిపి అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వైయస్సార్ రైతు భరోసా మరియు పిఎం కిసాన్ స్టేటస్ లింక్స్ కింది లింక్ ద్వారా చెక్ చేయండి.