ప్రస్తుతం ఉన్న YSR బీమా పేరును చంద్రన్న బీమా గా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్త్వులు జారీ చేశారు.
అయితే ప్రస్తుతం YSR బీమా కింద సహజ మరణానికి చెల్లిస్తున్న 1లక్ష రూపాయలు,ప్రమాద బీమా కింద చెల్లించే 5 లక్షల రూపాయలను యదావిధిగా కొనసాగించి రానున్న పాలసీ సంవత్సరం నుండి సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాద బీమా కింద 10 లక్షలు పెంచే అవకాశం ఉంది.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తేదీ (16.03.2024) నుండి నేటి వరకు గల కాలానికి సంబంధించి మరణించిన వారి క్లెయిమ్స్ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆప్షన్ ఇవ్వవలసి ఉన్నది.
గతంలో(2014-2019) చంద్రన్న బీమా పథకం కింద కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన వారి అందరికీ బీమా వర్తించేది. కావున రానున్న పాలసీ సంవత్సరంలో ఈ మార్పులు వచ్చేందుకు అవకాశం కలదు.
వాస్తవానికి బీమా పాలసీ సంవత్సరం మే నెలతో ముగుస్తుంది. ఐతే గత సంవత్సరం బీమా నమోదు జూన్ నెలలో జరిగి జూలై నుండి అమల్లోకి వచ్చింది. కావున ఈ బీమా ఈనెలలో ముగుస్తుంది.
కావున చంద్రన్న బీమా కింద కొత్తగా మార్గదర్శకాలు విడుదలై బీమా కొరకు కొత్తగా నమోదు( Enrollment) ప్రారంభించే అవకాశం ఉంది.
ఐతే కొత్త ప్రభుత్వం ఏర్పడటం, వాలంటీర్లు నియామకాలు ఇంకా జరగకపోవడం తదితర కారణాల వలన కొత్త బీమా నమోదు జూలై నెలలో ఉండే అవకాశం ఉంది.