Volunteer Arogyasri Survey Process : New YSR Aarogya Sri Cards Survey
మెగా ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం సమాచారం :
వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కార్డు పరిమితిని 25 లక్షల వరకు పెంపు. ఈ నెల 18న ఈ కార్య్రక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
ఈ కార్యక్రమంలో డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందించే ఉపయోగాలతో పాటుగా పెరిగిన మొత్తం Rs 25 లక్షలు కోసం తెలియజేయడం జరుగుతుంది.
పెరిగిన మొత్తం Rs.25 లక్షలు నగదును కార్డుపై ప్రింట్ చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆరోగ్యశ్రీ లబ్ధిదారుని కుటుంబానికి గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా అందించడం జరుగుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని గ్రామాలు మరియు వార్డులలో డిసెంబర్ 19 తేదీ నుండి ప్రారంభిస్తారు..
డిసెంబర్ 18 తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి టెలివిజన్ సదుపాయం కలిగిన సచివాలయ లేదా రైతు భరోసా ప్రాంగణంలో ముఖ్యమంత్రి ప్రారంభించే మెగా ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమాన్ని ప్రసారం చేసి, ప్రజలకు అవగాహన కలిగించాలి
జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత సమాచారం / 2nd Phase Jagananna Aarogya Suraksha Camps :
- జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతను జనవరి 2024 నుండి ప్రారంభించనున్నారు. ఇక ప్రతి ఆరు నెలలకు ఒకసారి జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది.
- గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు వారి సచివాలయంలో జరిగే జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు కోసం 15 రోజుల ముందుగానే సచివాలయ పరిధిలో ఉన్న ప్రజలందరికీ తెలియజేయవలసి ఉంటుంది. హెల్త్ క్యాంపు జరుగు తేదీ విడుదల అయిన తరువాత క్యాంపు తేదీకి ముందు 3 రోజుల ముందు సచివాలయ పరిధిలో ప్రజలందరికీ తెలియజేయవలసి ఉంటుంది.
- ఆరోగ్య సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది సహాయంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సచివాలయ పరిధిలో సజావుగా జరిగే విధముగా పంచాయతీ కార్యదర్శి వారు చూసుకోవలసి ఉంటుంది.
ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం సర్వే :
- మహిళా పోలీస్ వారితో గ్రామ వాలంటీర్లు ఒక హెల్త్ టీముగా ఏర్పడి ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ బ్రోచర్లను పంపిణీ చేయవలసి ఉంటుంది.
- మహిళా పోలీస్ వారు ANM / CHO వారితో కలిసి ప్రతి ఇంటిలో కనీసం ఒకరి మొబైల్ లో నైనా ఆరోగ్యశ్రీ యాప్ మరియు డిసా యాప్ ను డౌన్లోడ్ చేసుకునే విధంగా సూచనలు ఇవ్వవలెను.
- వాలంటీర్ వారు వారి క్లస్టర్ పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి పెరిగిన ఆరోగ్యశ్రీ మొత్తం అమౌంటు కోసం వివరిస్తూ ఆరోగ్యశ్రీ సర్వీసుల కోసం తెలియజేసి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను వారికి అందించి eKYC తీసుకోవలసి ఉంటుంది.
గ్రామ వార్డు వాలంటీర్లు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసి eKYC తీసుకునే విధానము : New Aarogya Sri Cards eKYC Process by GSWS Volunteers :
గ్రామ వార్డు సచివాలయాలకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చిన తర్వాత మాత్రమే ఈ సర్వే చేయుటకు అవకాశం ఉంటుంది. సర్వే చేయు సమయంలో వాలంటీర్లు సిటిజన్ కు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మొత్తం 25 లక్షలకు పెంచబడినట్టు తెలియజేస్తూ మరియు 25 లక్షలు కార్డుపై ప్రింట్ చేయబడి ఉన్నట్టు తెలియజేయాలి.
Step 1 : ముందుగా గ్రామ వార్డు వాలంటీర్ వారు కింద ఇవ్వబడిన లింకు ద్వారా కొత్తగా అప్డేట్ అయినGSWS Volunteers యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చెయ్యాలి.
Step 2 : వాలంటీర్ వారి CFMS ID ద్వారా Login అవ్వాలి. Biometric / IRIS / Facial ద్వారా లాగిన్ అయ్యే అవకాశం ఉంది.
Step 3 : Home Page లో “Aarogya Sri” ఆప్షన్ పై టిక్ చేయాలి. Select Type of Search వద్ద Aarogyasri Card Number మరియు Aadhar Card Number. రెండిటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ నెంబర్ను ఎంటర్ చేయాలి.
Step 4 : ఆరోగ్యశ్రీ నెంబర్ ద్వారా లేదా ఆధార్ కార్డు నెంబర్ ద్వారా కుటుంబ వివరాలు ఓపెన్ అవుతాయి. అందులో “Handed Over New Arogya Sri Card to the Family ? ( కొత్త ఆరోగ్యశ్రీ కార్డు ను ఈ కుటుంబానికి అందించారా? ) అందించినట్లయితే Yes అని టిక్ చేయాలి. తరువాత వారి కుటుంబంలో ఉన్న వ్యక్తుల పేర్లు కింద చూపిస్తుంది. ఎవరు అయితే అందుబాటులో ఉన్నారో వారి పేరుతో విచ్చేసిన తర్వాత వారి eKYC ను Biometric / IRIS / Facial ద్వారా తీసుకోవాలి.
Step 5 : ఆ కుటుంబానికి సంబంధించి కార్డు డెలివరీ పూర్తి అయినట్టు అర్థం. ఈ విధంగా వారి కష్టాలు పరిధిలో ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన వారందరికీ కూడా సర్వే పూర్తి చేయవలసి ఉంటుంది.