డ్వాక్రా మహిళలకు అదనంగా 5 లక్షల రుణం, వీరికి మాత్రమే

డ్వాక్రా మహిళలకు అదనంగా 5 లక్షల రుణం, వీరికి మాత్రమే

ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నటువంటి మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను అనుసంధానం చేసి ఒక్కో డ్వాక్రా సంఘంలోని మహిళకు లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలు వ్యక్తిగత రుణాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. కేంద్ర పథకాల తో అనుసంధానమైన వారికి 35% లోన్ రాయితీ లభిస్తుంది.

డ్వాక్రా మహిళలకు అదనంగా 5 లక్షల రుణం ఇలా [Five Lakh loan to Dwacra Women]

ప్రస్తుతం పొదుపు సంఘాల్లోని మహిళలకు కల్పిస్తున్న రుణాలకు అదనంగా ఈ రుణాలను అందిస్తారు.

వీరికి మాత్రమే..

  • డ్వాక్రా సభ్యులుగా ఉంటూ కొత్తగా జీవనోపాధి యూనిట్ ఏర్పాటు చేయాలనుకునే వారికి
  • ప్రస్తుతం జీవనోపాధి యూనిట్ కలిగి ఉన్నవారికి ఇస్తారు
  • ఒక పొదుపు సంఘం లో ముగ్గురికి ఈ రుణాలను అందించే అవకాశం.
  • ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల మందికి రుణాలను అందించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది.
  • ఇందులో 1.35 లక్షల మందికి లక్ష రుణం ఇస్తారు. గరిష్టంగా 15000 మందికి ఐదు లక్షల రుణం ఇస్తారు.

35% రాయితీ, కేంద్ర ప్రభుత్వ రెండు పథకాలతో అనుసంధానం

ప్రధానమంత్రి మైక్రో ఫడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం మరియు ప్రధాన మంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం పథకాలను ఇందుకు అనుసంధానించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ఎంపికైన వారికి ఏకంగా 35% రాయితీతో లోన్ అమౌంట్ లభిస్తుంది. అంటే నూటికి 35 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. మహిళలు మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఈ పథకం కింద ఏర్పాటు చేసుకోవచ్చు. ఉదాహరణకు మసాలా తయారీలు, డైరీ, పౌల్ట్రీ, అప్పడాలు, ఇతర ఏవైనా స్నాక్స్, పచ్చళ్ళు , బేకరీ, స్వీట్ షాప్ మొదలగు మైక్రో యూనిట్లను ప్రారంభించవచ్చు.

ఇవే కాకుండా ఎటువంటి వడ్డీ లేకుండా రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో ఐదు లక్షలు ఇచ్చేందుకు సిద్ధమైంది. వారు కూడా యూనిట్లను ప్రారంభించేందుకు ఈ వెసులుబాటు కల్పించడం జరిగింది.

మరిన్నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానెల్లో జాయిన్ అవ్వండి.

You cannot copy content of this page