SC,ST డ్వాక్రా మహిళలకు అదనంగా 5 లక్షలు

SC,ST డ్వాక్రా మహిళలకు అదనంగా 5 లక్షలు

ఏపీలో ఎస్సీ ఎస్టీ డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. డ్వాక్రా మహిళల్లో ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ మహిళకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతి పథకం(unnathi scheme) కింద అదనంగా 5 లక్షల వరకు రుణాలను మంజూరు చేయనున్నట్లు తెలిపింది.

గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఎస్సీ ఎస్టీ మహిళలకు జీవన ఉపాధి కల్పించేందుకు ఈ పథకానికి ప్రతి ఏటా వంద కోట్లను బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అయితే గత ప్రభుత్వం అనగా వైసిపి ప్రభుత్వం ఈ పథకాన్ని పట్టించుకోలేదు. ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తిరిగి పథకాన్ని ప్రారంభించింది.

ఉన్నతి పథకం అంటే ఏమిటి? ఏం లాభాలు ఉంటాయి?

ఉన్నతి పథకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం డ్వాక్రా సంఘాల మహిళలుగా ఉంటూ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళలకు అదనంగా రుణ సదుపాయం కల్పించడం జరుగుతుంది.

ప్రస్తుతం ఈ రుణ సదుపాయాన్ని 5 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయితే ఈ రుణానికి ఎటువంటి వడ్డీ లేదు. ప్రభుత్వం ఉచితంగా ఈ రుణం సదుపాయాన్ని కల్పిస్తుంది. లబ్ధిదారులు సకాలంలో ఈ రుణాలను వాయిదా పద్ధతిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

రుణం తీసుకున్న సదరు మహిళ 30 రోజుల్లో యూనిట్ ప్రారంభించినట్లు అనగా ఈ రుణం తో జీవనోపాధి పనులు చేస్తున్నట్లు చూపించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం 2024 25 ఆర్థిక సంవత్సరంలో 500 కోట్ల మేర ఈ పథకానికి బడ్జెట్ లో కేటాయింపులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

గృహ నిర్మాణం, విద్య మరియు భూమి కొనుగోలుకు వర్తింప చేసే అవకాశం

ఉన్నతి పథకం కింద కేటాయించినటువంటి రుణాన్ని ఏదైనా జీవనోపాధిక మాత్రమే ఉపయోగించే అవకాశం ఇప్పటివరకు ఉండేది. అయితే దీనిని ఎస్సీ ఎస్టీ మహిళలు భూమి కొనుగోలుకు లేదా గృహ నిర్మాణానికి లేదా విద్యకు కూడా ఉపయోగించేలా వీలు కల్పించాలని ప్రభుత్వానికి రావడం జరిగింది. దీనిని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఒకవేళ ఈ మూడింటికి కానీ ప్రభుత్వం అంగీకారం తెలిపితే ఎస్సీ ఎస్టీ మహిళలు గృహ నిర్మాణానికి లేదా ఉన్నత విద్యకు ఈ ఐదు లక్షల రూపాయలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా కూడా రుణం పొందే వీలు ఉన్న నేపథ్యంలో వీటితో కూడా సమన్వయం చేసుకునే అవకాశం ఉంటుంది. త్వరలో ఇందుకు సంబంధించి పూర్తి విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానెల్లో జాయిన్ అవ్వగలరు.

You cannot copy content of this page