కేంద్ర కేబినెట్ మూడు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. బయో ఈ-3 విధానం, విజ్ఞాన్ ధార.. 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌నకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
ఉద్యోగుల సామాజిక భద్రత కోసం యూనిఫైడ్ పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన తెలిపారు. రూ.10,579 కోట్ల వ్యయం అయ్యే ఈ పథకం ద్వారా సుమారు 23 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి కలగనుందన్నారు. బయో ఈ-3 విధానం ద్వారా త్వరలో బయో విప్లవం రాబోతోందని.. బయో టెక్నాలజీ, బయో సైన్స్ రంగాల్లో అధిక ఉపాధి అవకాశాలు ఉన్నాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయిమెంట్ ఆధారంగా బయో మనుఫ్యాక్చరింగ్ విధానం ఉంటుందన్నారు.