తెలంగాణ ప్రభుత్వం మూడు దశల్లో రైతు రుణమాఫీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లక్ష వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేయగా రెండోవ దశలో భాగంగా లక్షన్నర వరకు ఉన్న రుణాలను తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేసింది. ఇక రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15న మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే కొంతమందికి ఇంకా రుణమాఫీ పడలేదని పేర్కొంటున్న నేపథ్యంలో మంత్రి క్లారిటీ ఇచ్చారు. రుణమాఫీ ఏదైనా సాంకేతిక కారణాల వలన పడకపోతే అటువంటి వారికి తర్వాత జమ చేస్తామని ఆయన వెల్లడించారు. రుణమాఫీ పడలేదని విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ప్రభుత్వం వెల్లడించింది.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది.