తెలంగాణలో ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించి జనవరి 6 వరకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.
సుమారు కోటి 25 లక్షల పైగా దరఖాస్తులు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా స్వీకరించడం జరిగింది. వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ కూడా జనవరి 20 నాటికి ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియను కూడా ప్రభుత్వం ముమ్మరం చేసింది.
దరఖాస్తుదారులకు SMS మెసేజ్
ఆరు గ్యారెంటీలలో భాగమైన 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు మరియు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను ముందుగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
ఎందుకు సంబంధించి ఆయా శాఖల నుంచి లబ్ధిదారులకు ఇప్పటికే ఎస్ఎంఎస్ మెసేజ్ లు పంపించడం జరుగుతుంది.
కింది విధంగా మెసేజ్ ను విద్యుత్ శాఖ దరఖాస్తుదారులకు పంపించడం జరిగింది.
పైన పేర్కొన్న విధంగా దరఖాస్తుదారులు వెరిఫికేషన్ అనగా ధ్రువీకరణ సమయంలో మీ ప్రజా పాలన దరఖాస్తు రసీదు, ఆహార భద్రత కార్డు అనగా రేషన్ కార్డు మరియు లోకల్ అడ్రెస్ తో ఉన్నటువంటి ఆధార్ కార్డును అందుబాటులో ఉంచాలని సూచించడం జరిగింది.
ఇతర డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆయా పథకాల అమలు కి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అర్హులైన వారికి సంబంధిత శాఖలు ఎస్ఎంఎస్ పంపించనున్నాయి. మొత్తం 100 రోజుల పరిపాలనలో ఈ ఆరు గ్యారెంటీలను అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఎవరైతే జనవరి నెలలో దరఖాస్తు ఇవ్వడం మిస్ అయ్యారో, వారు సంబంధిత డాక్యుమెంట్లు రెడీ చేసుకుని ఏప్రిల్ లేదా మే నెలలో జరగనున్న రెండో దశ ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులను అందజేయవచ్చు.
మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి.