తెలంగాణలో కొత్త ఓటు నమోదు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ అప్డేట్ మీకోసమే. రాష్ట్రంలో కొత్తగా ఓటు నమోదు చేసుకునేవారికి ప్రస్తుతం ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది.
ఓటరు నమోదు, ఓటర్ల జాబితా సవరణ వంటి అంశాలపై స్పెషల్ సమ్మరి రివిజన్ 2025 షెడ్యూల్ మరియు కార్య చరణ ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.
కొత్త ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
ఇందులో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 2025 నాటికి 18 ఏళ్లు నిండే యువత అందరూ కూడా కొత్త ఓటర్ గా నమోదు చేసుకోవాలని సీఈఓ సీ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.
ఆన్లైన్లో ఓటర్ పోర్టల్ ద్వారా లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా సులభంగా ఓటు నమోదు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్నట్లు ఏదైనా ధ్రువీకరణ పత్రం సమర్పించి ఓటు నమోదు చేసుకునే వెసులు బాటు ఉంటుంది.
ఓటర్ రిజిస్ట్రేషన్ మరియు జాబితా విడుదల షెడ్యూల్
ఓటర్ సవరణ లేదా ఎన్నికల జాబితా సవరణ ప్రక్రియ గత నెల 20న ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే. తొలి ముసాయిదా జాబితాను సీఈవో అక్టోబర్ 29న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. నవంబర్ 28 వరకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించడం జరుగుతుంది. చివరగా సవరించిన తుది ఓటర్ జాబితాను జనవరి 6 2025న విడుదల చేయనున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు.
ఆన్లైన్లో పూర్తి ఉచితంగా ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకునే పూర్తి విధానం ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.