తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల వర్షాలకు నష్టపోయిన వరద బాధితులకు అండగా ఉంటామని ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. చివరి బాధితుడి వరకు సహాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలో ప్రతి జిల్లాను పంపు జిల్లాకు గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.
వరద బాధితులకు 16,500 రూపాయలు మరియు ఇందిరమ్మ ఇల్లు
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇల్లు కోల్పోయిన వారికి తక్షణమే ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు అందజేయాలని మంచి పొంగులేటి ఆదేశించారు. పాక్షికంగా ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని తెలిపారు. అదే విధంగా వరద బాధితులకు 16,500 ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు.
మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు సహాయం అందిస్తున్నట్లు గా కూడా ఆయన ప్రకటించారు.
వరద బాధితులకు ఆర్థిక సహాయం కోసం ప్రతి ఠాణాలో ప్రత్యేక కౌంటర్లు ఓపెన్ చేసి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి వెల్లడించారు.