తెలంగాణ లో మలి విడత రుణమాఫీ 2024 జమ

తెలంగాణ లో మలి విడత రుణమాఫీ 2024 జమ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మలి విడత రుణమాఫీ కి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే తొలి విడత లో భాగంగా లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం, లక్షన్నర వరకు ఉన్నటువంటి రుణాలను రెండో విడత లో భాగంగా మాఫీ చేయడం జరిగింది.

ఆగస్టు 15న మలి విడత రుణమాఫీ

ఆగస్టు 15 నాటికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల రుణమాఫీ పెట్టిన పూర్తి చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ మాటకు కట్టుబడి చివరి విడత రుణమాఫీ అమౌంట్ ను ఆగస్టు 15న విడుదల చేస్తుంది.

ఖమ్మం జిల్లా వైరా పర్యటనలో భాగంగా ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నారు.

చివరి విడత లో భాగంగా రెండు లక్షల వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. 1,50,000 నుంచి 2 లక్షల మధ్య ఉన్న రుణాల కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మలి విడత లో భాగంగా 14.45 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అన్ని విడతలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 76 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

తెలంగాణ రైతు రుణమాఫీ అమౌంట్ పడిందా లేదా తెలుసుకునేందుకు మీరు మీ బ్యాంకులో సంప్రదించి మీరు మీ రుణ వివరాలను తెలుసుకోవచ్చు. అయితే ఆగస్టు 15న పబ్లిక్ హాలిడే ఉన్న నేపథ్యంలో ఆగస్టు 16, 17 తేదీలలో నగదు సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది.

You cannot copy content of this page