తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గురువారం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఇందుకు హాజరైన గవర్నర్ తమిళిసై… సీఎంతో పాటు మంత్రులతో ప్రమాణం చేయించారు. ప్రమాణం చేసిన వారిలో మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఉన్నారు.
- డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి – భట్టి విక్రమార్క
- హోం మంత్రి- ఉత్తమ్ కుమార్‌రెడ్డి
- మున్సిపల్ శాఖ మంత్రి – కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- ఆర్థికశాఖ మంత్రి – డి.శ్రీధర్‌బాబు
- నీటి పారుదలశాఖ మంత్రి – పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
- మహిళా సంక్షేమశాఖ మంత్రి – కొండా సురేఖ
- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి – దామోదర రాజనర్సింహ
- పౌరసరఫరాలశాఖ మంత్రి – జూపల్లి కృష్ణారావు
- బీసీ సంక్షేమశాఖ మంత్రి – పొన్నం ప్రభాకర్
- గిరిజన సంక్షేమశాఖ మంత్రి – సీతక్క
- రోడ్లు, భవనాల శాఖ మంత్రి – తుమ్మల నాగేశ్వరరావు
మరోవైపు సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రి నియమితులయ్యారు. ఇంటెలిజెన్స్ ఐజీ గా శివధర్ రెడ్డిని నియమిస్తూ…సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.