ఆగస్టు 1 న భేటీ అయిన తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం రేషన్ కార్డులు, ధరణి, జాబ్ కేలండర్ వంటి అంశాలపై కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే [Telangana Cabinet Key Decisions]
ఆగస్టు 1 న తెలంగాణ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..
- కొత్త రేషన్ కార్డుల జారీకి కీలక ఆమోదం. వార్షిక ఆదాయం పెంచే అవకాశం. విధివిధానాల రూపకల్పనకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీ.
- ఆగస్టు 2న జాబ్ క్యాలెండర్ విడుదలకు నిర్ణయం. జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
- నిఖత్ జరీన్ మరియు మొహమ్మద్ సిరాజ్ కు హైదరాబాద్ లో 600 గజాల స్థలం మరియు గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయం.
- ధరణి పోర్టల్ ను భూమాత గా మారుస్తూ కీలక నిర్ణయం.
- ఇక వాయనాడ్ లో జరిగిన భూ ప్రళయానికి సంబంధించి క్యాబినెట్ సంతాపం తెలిపింది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వగలరు.