తెలంగాణలో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టె ముందు సంబంధిత అంశాలపై తెలంగాణ క్యాబినెట్ కీలక సమావేశం నిర్వహించింది.
ఇందులో ముఖ్యంగా ఆరు గ్యారెంటీ ల అమలులో మరో రెండు పథకాల అమలకు సంబంధించి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు: కింది అంశాలపై తెలంగాణ క్యాబినెట్ నేడు కీలక నిర్ణయాలు తీసుకుంది.
- ఆరు గ్యారెంటీలలో రెండు పథకాలు అనగా 500 కే సిలిండర్ మరియు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రాయితీ పథకాలకు సంబంధించి తెలంగాణ క్యాబినెట్ ఆమోదం. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 కే సిలిండర్ మరియు గృహ జ్యోతి పథకంలో భాగంగా 2 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
- ఇక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తేదీలను ఖరారు చెయ్యడం జరిగింది. ఫిబ్రవరి 8 నుంచి సమావేశాలు 10 లేదా ఆ తర్వాత మద్యంతర బడ్జెట్.
- మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించి ఇలా ముందుకు వెళ్లాలో కార్యచరణ పై క్యాబినెట్ ఆమోదం
- అదేవిధంగా 6 గ్యారంటీల అమలు మరియు వాటికి బడ్జెట్లో కేటాయించాల్సిన అమౌంట్ కి సంబంధించి కూడా చర్చించడం జరిగింది.
- రాష్ట్ర అధికారిక గీతం గా జయ జయహే తెలంగాణ గీతంకు క్యాబినెట్ ఆమోదం
- వాహనాల రిజిస్ట్రేషన్ లో TS కి బదులుగా TG ఉపయోగించాలని క్యాబినెట్ నిర్ణయం
- తెలంగాణ తల్లి విగ్రహ రూపం మరియు రాష్ట్ర చిహ్నంలోను మార్పులు చేయాలని క్యాబినెట్ నిర్ణయం
- రాష్ట్రంలో కులగణన జరపాలని నిర్ణయం.
- అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం.
- కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటుచేయాలని నిర్ణయం.
- తెలంగాణ హైకోర్టుకు 100 ఎకరాలు కేటాయింపుకు నిర్ణయం
- 65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా అప్డేట్ చేయాలని నిర్ణయం.
- సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేయాలని నిర్ణయం.