ఇక నుంచి TS కాదు TG.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం

ఇక నుంచి TS కాదు TG.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం

సంచలన నిర్ణయాలతో పాలనలో తన మార్కు చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ స్టేట్ అని వచ్చేలా TS అని షార్ట్ ఫాంని ప్రభుత్వం రిజిస్టర్ చేయించింది. కేవలం నెంబర్ ప్లేట్లపైనే కాకుండా.. అన్ని ప్రభుత్వ సంస్థలకు కూడా తెలంగాణ స్టేట్ అని వచ్చేలా పేర్లు మార్చారు. అయితే, ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని మార్చాలని ఫిబ్రవరి నాల్గోతేదీన జరిగిన కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ‘టీఎస్’ అనే షార్ట్ ఫాంను.. ఇప్పుడు టీజీ (TG- Telangana) గా మారబోతోంది.

తెలంగాణ ఏర్పడిన సమయంలోనే “టీజీ”గా నిర్ణయిస్తారని అందరూ భావించినప్పటికీ, అనూహ్యంగా టీఎస్ అని తెలంగాణ పేరును కేసీఆర్ సర్కార్ రిజిస్ట్రేషన్ చేపించింది. దీనిపై మొదట్లో ఒకింత వ్యతిరేకత కూడా వచ్చింది. అయితే.. ‘టీజీ’ అంటే తెలంగాణ అనే ఒకే పదాన్ని రెండుగా విభజించినట్టవుతుందని.. అది ఒకటే పదంగా ఉంచేందుకే తెలంగాణ స్టేట్ అని వచ్చేలా ‘టీఎస్‌’ అనే అక్షరాలను రిజిస్టర్ చేసినట్టు వివరణ ఇచ్చారు. ఇప్పుడు టీఎస్ కాస్త టీజీగా మారితే మాత్రం కేవలం నెంబర్ ప్లేట్లు మాత్రమే కాదు.. చాలా మార్చాల్చి వస్తుంది.

You cannot copy content of this page