తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి పద్దును జూలై 25వ తేదీ ఉపముఖ్యమంత్రి మరియ ఆర్థిక మంత్రి అయిన భట్టి విక్రమార్క అసెంబ్లీ లో ప్రవేశ పెట్టారు.
తెలంగాణ బడ్జెట్ 2024-25 కీలక వివరాలు
- బడ్జెట్ పూర్తి అమౌంట్ : రూ.2,91,159కోట్లు
- మూలధన వ్యయం: రూ. 33,487 కోట్లు
- పన్ను ఆదాయం : రూ. 1,38,181.26 కోట్లు
- పన్నేతర ఆదాయం: రూ.35,208.44 కోట్లు
- కేంద్ర పన్నుల్లో వాటా : 26.216.28 కోట్లు
- ఈ ఏడాదికి తీసుకునే అప్పు : రూ.57,112 కోట్లు
- ఆర్థిక లోటు అంచనా: రూ.49,255.41 కోట్లు
- ప్రాథమిక లోటు అంచనా: రూ.31,525.63 కోట్లు
- రెవెన్యూ మిగులు అంచనా రూ.297.42 కోట్లు
తెలంగాణ బడ్జెట్ 2024-25 ముఖ్యాంశాలు – కీలక కేటాయింపులు
తెలంగాణ అసెంబ్లీ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తమ బడ్జెట్ వ్యవసాయ ప్రధాన బడ్జెట్ అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వ్యవసాయ ప్రభుత్వమని అందుకే వ్యవసాయానికి పెద్ద పెద్ద వేసినట్లు తెలిపారు. వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రభుత్వం భారీ కేటాయింపులు చేయడం జరిగింది. వివిధ శాఖల వారీగా ప్రభుత్వం కేటాయించిన నిధులు కింద ఇవ్వబడ్డాయి.
రాష్ట్ర బడ్జెట్ ప్రధాన కేటాయింపులు ఇవి..
వ్యవసాయానికి రూ.72,659 కోట్లు
ఉద్యానశాఖకు రూ.737కోట్లు
పశుసంవర్ధశాఖకు రూ.1,980కోట్లు
రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి రూ. 723కోట్లు
గృహజ్యోతికి రూ.2,418కోట్లు
ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3836కోట్లు
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు రూ.29,816 కోట్లు
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)కు రూ.1,525 కోట్లు
స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 2,736 కోట్లు
ఎస్సీ సంక్షేమం రూ.33,124కోట్లు
ఎస్టీ సంక్షేమం రూ.17,056కోట్లు
మైనార్టీ సంక్షేమం రూ.3,003కోట్లు
బీసీ సంక్షేమం రూ.9,200 కోట్లు
వైద్య, ఆరోగ్యం రూ. 11,468 కోట్లు
ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు
అడవులు, పర్యావరణం రూ.1,064 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ. 2,762 కోట్లు
ఐటీ శాఖకు రూ.774 కోట్లు
నీటిపారుదల రంగానికి రూ.22,301 కోట్లు
విద్యకు రూ.21,292 కోట్లు
హోంశాఖకు రూ.9,564కోట్లు
రోడ్లు, భవనాల శాఖకు రూ.5,790 కోట్లు