ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం అమలు చేసే సూపర్ సిక్స్ పథకాల గురించి మరియు ఆరు గ్యారంటీ పథకాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
TDP Super Six Schemes 2024: తెలుగుదేశం కూటమి అమలు చేయబోయే సూపర్ సిక్స్ పథకాలు

- యువత కు 20 లక్షల ఉపాధి అవకాశాలు (3 వేల నిరుద్యోగ భృతి)
- ప్రతి స్కూల్ కి వెళ్ళే విద్యార్థి కి 15000
- ప్రతి రైతుకూ ఏటా ₹20000
- ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు
- ప్రతి మహిళ కి ప్రతి నెల ₹1500
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఈ పథకాలను మరింత వివరంగా చూద్దాం.
- యువత కు 20 లక్షల ఉపాధి అవకాశాలు – తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే పెట్టనున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాకుండా యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ప్రతినెల 3000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని టిడిపి+ ప్రకటించింది.
- ప్రతి స్కూల్ కి వెళ్ళే విద్యార్థి కి 15000 – రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి 15వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించినట్లు కూటమి ప్రకటించింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 రూపాయలు చొప్పున తల్లి ఖాతాలో జమ చేయనున్నారు.
- ప్రతి రైతుకు ఏటా 20వేల రూపాయలు – అన్నదాత పథకం కింద తెలుగుదేశం పార్టీ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రతిఏటా 20వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు ప్రకటించడం జరిగింది.
- ప్రతి ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు – తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ లను ఉచితంగా అందించిన ఉన్నట్లు టిడిపి కూటమి ప్రకటించింది.
- ప్రతి మహిళకు నెలకి 1500 – మహాశక్తి పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు 15,00 రూపాయలను వారి ఖాతాలో జమ చేయనున్నట్లు టిడిపి కూటమి ప్రకటించింది. ఈ లెక్కన చూసుకుంటే ప్రతి ఏడాది 18000 రూపాయలను మహిళల ఖాతాలో జమ చేయనున్నారు.
- మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం – ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమల్లో ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేయనున్నట్లు తెలుగుదేశం పార్టీ కూటమి వెల్లడించింది. ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో ఈ సౌకర్యాన్ని కల్పించనున్నారు. మహిళలు ఆధార్ కార్డు చూపించి రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడి ఎవరికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు.
ఇక తెలుగుదేశం పార్టీ అమలు చేసే 6 గ్యారెంటీ పథకాలను కింద తెలుసుకుందాం.
తెలుగుదేశం పార్టీ గ్యారెంటీ పథకాలు
- మహా శక్తి
- పూర్ టు రిచ్
- యువగళం
- అన్నదాత
- ఇంటింటికీ మంచి నీరు
- బీసి లకు రక్షణ
1. మహా శక్తి పథకం ప్రయోజనాలు:
- ఈ పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీ కి ఆడబిడ్డ నిధి కింద నెలకు ₹1500 నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ.
- తల్లికి వందనం పేరుతో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ₹15000 చప్పున తల్లి ఖాతాలో జమ.
- దీపం పథకం ద్వారా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ లు ఉచితం.
- రాష్ట్రం లోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.

2. పూర్ టు రిచ్ పథకం – ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉండే పేద బలహీన వర్గాలకు వివిధ ఉపాది సంక్షేమ పథకాల ద్వారా జీవనోపాధి కల్పించి వారిని ధనికులను చేసే పథకం.

3. యువగళం పథకం – యువగళం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ పైన పెడతామని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ఇప్పటికే స్పష్టం చేసింది.
ప్రతి నిరుద్యోగికి ప్రతినెల 3000 రూపాయలను యువగళం నిధి కింద నిరుద్యోగ భృతి ఇస్తామని టిడిపి ప్రకటించింది.

4. అన్నదాత పథకం – ఈ పథకం ద్వారా రైతులకు ఏడాది కి 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని తాము అందించనున్నట్లు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తెలుగుదేశం పార్టీ వెల్లడించింది.

5. ఇంటింటికీ నీరు పథకం – ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచి నీటి కులాయి కనెక్షన్ ఇవ్వనన్నట్లు కూటమి ప్రకటించింది.

6. బీసీలకు రక్షణ చట్టం – ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉండే బీసీలకు మరియు మైనారిటీలకు ప్రత్యేక చట్టాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉండే బీసీలకు 50 ఏళ్లకే పింఛను ఇవ్వనున్నట్లు కూటమి తెలిపింది.
