అక్టోబర్ 9న ఏపి ప్రజలకు ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ తెలిపారు. విశాఖపట్నంలో TCS తన డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
సాగర తీరంలో TCS
భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మొట్ట మొదట విస్తరింప చేసేందుకు పాటు బడిన కొద్ది మందిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరు. ఆయన నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కై పాటుపడుతుంది.
విభజనలో భాగంగా హైదరాబాద్‌ను కోల్పోయిన రాష్ట్రానికి ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా చూస్తే చాలా తక్కువ కంపెనీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఐటీ విస్తరణ మరియు పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా శ్రమిస్తోంది.
కొన్ని రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడుతో టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్‌తో సమావేశమై, ఏపీలో పెట్టుబడులు పెట్టే విషయమై చర్చించడం జరిగింది. ఇందుకు కొనసాగింపుగా రెండు రోజుల క్రితం చంద్రశేఖరన్ ఐటీ మంత్రి నారా లోకేష్ తో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు, విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ ఏర్పాటుకు అంగీకరించారు.
TCS వైజాగ్ తో పది వేల ఉద్యోగాలు
టిసిఎస్ వైజాగ్ ద్వారా 10000 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు సంస్థ ముందుకు వచ్చింది. దీంతో పరోక్షంగా స్థానికులకు మరిన్ని ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
TCS కాకుండా, అదనంగా, ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్ ఇండియా మరియు విస్తారాతో సహా టాటా యాజమాన్యంలోని ఎయిర్‌లైన్స్ విస్తరణకు సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయి.
ఇతర పెట్టుబడులు పెట్టగల ఇతర రంగాలలో పునరుత్పాదక శక్తి, టెలికమ్యూనికేషన్స్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉన్నాయి. 2047 కోసం “స్వర్ణ ఆంధ్రప్రదేశ్” విజన్ కింద పారిశ్రామిక వృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో టాటా సంస్థ పాలు పంచుకోనుంది.
మరి టిసిఎస్ ఎక్కడ పెడతారు అంటే చాలా వరకు రిషికొండ ప్రాంతంలోనే పెట్టే అవకాశం ఉంది.
కేవలం 4 నెలల్లో APలో 5 పెద్ద పెట్టుబడులు
ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడంలో ఆ ప్రభుత్వం దూకుడు చూపిస్తుంది. ఇప్పటికే లులు, సుజ్లాన్, బ్రూక్‌ఫీల్డ్, ఒబెరాయ్లను ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకొచ్చింది. TCS పెట్టుబడి తో ప్రైవేట్ రంగంలో ఇది 5వ పెద్ద పెట్టుబడి.