ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి నేనికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆధార్ అప్డేట్ తప్పనిసరి అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇంకా పథకం యొక్క పూర్తి విధి విధానాలు మరియు గైడ్లైన్స్ విడుదల చేయలేదు. దీనితో విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ఇంట్లోని ప్రతి పిల్లలకి తల్లికి వందనం పథకం నిధులు అందుతాయా లేదా అన్నది గందరగోళం ఏర్పడింది. అయితే తాజాగా మంత్రి నారా లోకేష్ తల్లికి వందనం పథకంపై అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలను చేశారు.
‘తల్లికి వందనం’ పథకానికి విధివిధానాలను రూపొందిస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన పలుప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఎంతమంది పిల్లలుఉన్నా అందరికీ ‘తల్లికి వందనం’ ఇస్తామని స్పష్టం చేశారు.ప్రభుత్వ, ప్రైవేటు బడుల విద్యార్థులందరికీ ఈ పథకాన్నివర్తింపజేస్తామన్నారు. ఇంట్లోని ప్రతి ప్రతి బిడ్డ, తల్లికి వందనం పథకానికి అర్హులని వ్యాఖ్యానించారు. కావున అర్హులైన వారు పథకానికి కావాల్సిన డాక్యుమెంట్లను ముందుగానే రెడీ చేసి పెట్టుకోవడం శ్రేయస్కరం.
తల్లికి వందనం పథకం వివరాలు
ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు అమ్మకు వందనం పేరుతో ఏడాదికి రూ.15వేలు ఆర్థిక సాయం అందనుంది. అయితే తల్లికి వందనం పథకానికి తప్పనిసరిగా ఆధార్ కలిగి ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఒకవేళ ఎవరికైనా ఆధార్ కార్డ్ లేకపోతే.. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది. విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు చేసుకునేందకు అవకాశం కల్పించాలని సూచించారు.
అయితే ఆధార్ వచ్చే వరకు 10 రకాల పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఆధార్ వచ్చే వరకు ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్టు, బ్యాంకు లేదా తపాలా పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్సు, ఉపాధి పథకం కార్డు, కిసాన్ పాస్బుక్, వ్యక్తిని ధ్రువీకరిస్తూ గెజిటెడ్ అధికారి సంతకం చేసిన పత్రం, తహసీల్దారు ఇచ్చే పత్రాలను, మరో పత్రం.. ఇలా పలు డాక్యుమెంట్లను అనుమతిస్తారని తెలిపారు. అమ్మకు వందనం పథకానికి సంబంధించి.. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, స్కూళ్లకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులకు ఏడాదికి రూ. 15 వేలు ఆర్థిక సాయం అందిస్తారు. అలాగే విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది.