Swarnandhra 2047 Vision Document – స్వర్ణాంధ్ర 2047 విజన్‌

Swarnandhra 2047 Vision Document – స్వర్ణాంధ్ర 2047 విజన్‌

కేంద్రప్రభుత్వం చేపట్టిన వికసిత్‌ భారత్‌ 2047లో భాగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించి నవంబరు 1న ఆవిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్‌ ప్రణాళిక ను రూపొందిస్తున్నట్టు తెలిపారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిద్దడంతో పాటు 43 వేల డాలర్లకు పైగా తలసరి ఆదాయంతో కూడి న 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు.

ప్రాధ్యానతా అంశాలతో స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌

ముఖ్యంగా గ్లోబల్‌ హై వాల్యూ అగ్రీ అండ్‌ ప్రోసెసింగ్‌ పవర్‌ హౌస్‌, పరిశ్రమ ఆధారి త నైపుణ్య పెంపుదల విద్య, తూర్పుతీరంలో లాజిస్టిక్స్‌ కేంద్రంగా ఎదగడం, పారిశ్రామిక /పునరుత్పాదకాలకు కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దడం వంటి అంశాల ప్రాధాన్యతతో స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందించనున్నట్టు చెప్పారు. అలాగే అత్యున్నత నాణ్యత, నెక్స్ట్‌ జనరేషన్‌ సర్వీసెస్‌ హబ్‌గా, ప్రధాన పర్యాటక కేంద్రంగా, వృద్ధి కేంద్రాలుగా మహా నగరాలు, సాంకేతికతతో కూడిన అందుబాటులో ఉండే వైద్యం, గౌరవ ప్రదమైన సురక్షిత, ఉత్పాదక జీవితం, వాతావరణం, మొదట ప్రాధాన్యతగా అభివృద్ధి విధానం, సుస్థిర ప్రభు త్వం, డిజిటల్‌ సుపరిపాలన, స్థిరమైన వృద్ధితో కూడిన ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక విధానంతో కూడిన రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను రూపొందిం చేందుకు ప్రజలు, వివిధ స్టేక్‌ హోల్డర్ల నుంచి సూచనలు, సలహాలు, అభిప్రాయాలను తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఇందుకోసం క్యూఆర్‌ కోడ్‌తో కూడిన ముసా యిదా డాక్యుమెంట్‌ను ఈనెల 21 నుంచి అక్టోబరు 5 వరకు ఐటీ విభాగం ద్వారా ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని వెల్లడిరచారు. అనంతరం అక్టోబరు 5లోపు వివిధ వర్గాల నుంచి అనగా లీడ్‌ డిస్ట్రిక్‌ మేనేజర్లు, ఇండస్ట్రియల్‌ చాంబర్‌ అసోసియేషన్లు, రైతులు సంఘాలు, ఆక్వా సంఘాలు తదితరుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ను తీసుకుంటామని చెప్పారు.

ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సదస్సులు

ఈనెల 21 నుంచి అక్టోబరు 5లోగా స్వర్ణాంధ్ర 2047 విజన్‌పై ప్రజల్లో విస్తృత అవ గాహన కల్పించేందుకు మండల, మున్సిపల్‌, గ్రామ పంచాయతీ స్థాయిల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని వెల్లడిరచారు. అలాగే జిల్లా కలెక్టర్ల స్థాయిలో రైతులు, ప్రముఖ వ్యక్తులు, వివిధ చాంబర్లు, ఇతర సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని సూచించారు. అంతేగాక జిల్లాస్థాయిలో ఎంపీ, ఎమ్మె ల్యే, ఎమ్మెల్సీ తదితర ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశిం చారు. విద్యార్థుల్లో కూడా అవగాహన కల్పించేందుకు అవే తేదీల మధ్య వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు వ్యాసరచన, వ్యక్తృత్వ తదితర పోటీలను నిర్వహిం చాలని స్పష్టం చేశారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు గ్రామ వార్డు సచివాలయాలు, పీఆర్‌ అండ్‌ ఆర్‌డీ, ఎంఏయూడీ, పోలీస్‌, రెవెన్యూ, విద్యాశాఖల పరిధిలోని వారి మొబైల్‌ ఫోన్లకు వాట్సాప్‌ సందేశాలు పంపాలని ఆదేశించారు. అలాగే ప్రణాళిక, సమాచార శాఖల ద్వారా పోస్టర్లు, హోర్డింగ్‌లు, వీడియో డాక్యుమెంట్ల ప్రదర్శనతో పాటు వివిధ ప్రసార మాధ్యమా ల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

నవంబర్‌ 1న విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ

స్వర్ణాంధ్ర 2047 విజన్‌లో భాగంగా ఈనెల 30 నాటికి మండల ప్రణాళికలను సిద్ధం చేయాల్సి ఉందని, అక్టోబరు 15 నాటికి జిల్లా విజన్‌ ప్రణాళికలను సిద్ధం చేయాల్సి ఉందని సూచించారు. అక్టోబరు 16-20 మధ్య స్వర్ణాంధ్ర 2047 ముసాయిదా ప్రణాళికను నీతి ఆయోగ్‌ ఖరారు చేశాక అక్టోబరు చివరివారంలో దానిపై రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్‌ చేసి వారిచ్చే సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకున్నాక అక్టోబరు 28న స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను ఖరారు చేయనున్నట్టు తెలిపారు. నవంబరు 1న స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ను లాంచనంగా ఆవిష్కరించడం జరుగుతుందని చెప్పారు. అంతకుముందు రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్‌ స్వర్ణాంధ్ర విజన్‌ ప్రణాళిక ఉద్దేశాలను పవర్‌ పాయింట్‌ ద్వారా వివరించారు. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌, ఉన్నత విద్యాశాఖ, ఐటీ శాఖ కార్యదర్శి సౌరవగౌర్‌ ఆయా శాఖల పరంగా తీసు కుంటున్న చర్యలను వివరించారు. పలువురు జిల్లా కలెక్టర్లు వారి జిల్లాల్లో ప్రాధాన్యత కలిగిన అంశాల ఆధారంగా ఐదేళ్ల జిల్లా కార్యాచరణ ప్రణాళికల రూపకల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఈ సమావేశంలో ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్‌ హరినారాయణ, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణతేజ, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకు మారి, ఆ శాఖ డైరెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి, ప్రణాళికా శాఖ జె.ఎస్‌.అనంతశంకర్‌ తదితర అధికారులు, వర్చువల్‌గా వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు పాల్గొన్నారు.

స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్‌లో భాగస్వాములు అవ్వడం ఎలా? [Swarnandhra 2047 Vision]

ఏపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతూ ఓ కొత్త కార్యక్రమం చేపట్టింది. స్వర్ణాంధ్ర@2047 పేరుతో ఓ సర్వే చేపట్టింది. మీ విజన్ – మా మిషన్.. కలసికట్టుగా ఆంధ్రప్రదేశ్ ని పునర్నిర్మిద్దామంటూ ప్రజల నుంచి సలహాలు సూచనలను ఆహ్వానిస్తోంది. దీనికోసం http://swarnandhra.ap.gov.in వెబ్ సైట్ లో ఓ లాగిన్ పేజ్ రూపొందించారు. మొబైల్ ఫోన్ లో క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే విజన్ డాక్యుమెంట్ లోకి నేరుగా ఎంటర్ అవుతాం. అక్కడ మిగతా వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. 

స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసిన తర్వాత నేరుగా విజన్ డాక్యుమెంట్ పేజ్ తో లింక్ ఓపెన్ అవుతుంది. అక్కడ మన పేరు, ఫోన్ నెంబర్, జిల్లా, వయసు, వృత్తి, ఈమెయిల్.. తదితర వివరాలు అప్ లోడ్ చేసిన తర్వాత స్వర్ణాంధ్ర-2047 ప్రజాభిప్రాయ సేకరణ మొదలవుతుంది. 
1. 2047 నాటికి ఆంధ్రప్రదేశం కోసం విజన్
2.  ఆర్థికాభివృద్ధికి కీలక రంగాలు
3. జీవన ప్రమాణాల పెంపు
4. సుస్థిర, పర్యావరణానుకూల వృద్ధి
5. భవిష్యత్తు నైపుణ్యాలు, ఉద్యోగావకాశాలు
6. పాలన మెరుగుపరచడం
7. మహిళా సాధికారత
8. రైతుల ఆకాంక్షలు
9. బలహీన వర్గాల ఆకాంక్షలు
10. భారత దేశం మరియు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ నిర్వహించాల్సిన పాత్ర..

ఇలా ఇందులో 10 ప్రశ్నలు ఉంటాయి. ఆయా ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను మనం నేరుగా అందులో పొందుపరచాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే కొన్ని ఆప్షన్లను ఇచ్చింది. ప్రతి ప్రశ్నకు ఆ ఆప్షన్లనుంచి మూడింటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. 

ఆయా ప్రశ్నలతోపాటు అదనపు సూచనలు ఇవ్వడానికి కూడా అవకాశం కల్పించారు. దాని తర్వాత ఒక తీర్మానం ఉంటుంది. బాధ్యతాయుతమైన పౌరుడిగా భారతదేశం, ఆంధ్రప్రదేశ్ ప్రగతిపథంవైపు వెళ్లేందుకు నా వంతు క్రియాశీలక భూమిక పోషిస్తానంటూ ప్రతిజ్ఞ చేస్తున్నట్టుగా తీర్మానం ఉంటుంది. దాని తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మనం కూడా స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ లో భాగస్వామ్యులం అయినట్టు. 

కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి కావడంతో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ విజన్ డాక్యుమెంట్స్ కూడా పూర్తి చేయిస్తున్నారు. గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా స్వర్ణాంధ్ర 2047 విజన్ కార్యాచరణ ప్రణాళికను ఇంటింటికీ చేరవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. విజన్ డాక్యుమెంట్ కార్యక్రమంలో పాల్గొని సూచనలు ఇచ్చిన వారికి సీఎం చంద్రబాబు ఫొటో, సంతకంతో కూడిన డిజిటల్ సర్టిఫికెట్‌ ఇస్తారు. 

ఈ కార్యక్రమానికి సంబంధించి ఈనెల 27 నుంచి 29 వరకు స్కూళ్లు, కాలేజీలలో విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 5 వరకు జిల్లా కలెక్టర్లు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. రైతులు, వ్యాపారులు, ఇతర అసోసియేషన్ల ప్రతినిధులు.. అన్ని వర్గాల వారితో కూడా సమావేశాలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 30 నాటికి మండల స్థాయిలో, అక్టోబరు 15 నాటికి జిల్లా స్థాయిలో.. స్వర్ణాంధ్ర 2047 విజన్ సిద్ధం కావాలని ప్రభుత్వం ఆదేశించింది.

You cannot copy content of this page