రైతులకు గుడ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించినటువంటి నిధులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి 28న రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయడం జరిగింది. దీంతో పాటు రైతు భరోసా కింద కేంద్ర ప్రభుత్వం జమ చేస్తున్నటువంటి పిఎం కిసాన్ నిధులను కూడా బటన్ నొక్కి ముఖ్యమంత్రి విడుదల చేశారు, అయితే కౌలు రైతులకు మాత్రం పీఎం కిసాన్ నిధులు వర్తించవు కాబట్టి కవులు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద నగదు జమ చేస్తూ వస్తుంది.
ఈ నిధులు విడుదల చేసి మూడు వారాలు గడుస్తున్నా ఇప్పటివరకు సున్నా వడ్డీ పథకం మరియు రైతు భరోసా కౌలు రైతులకు సంబంధించిన అమౌంట్ ఇంకా జమ కాలేదని పలువురు రైతులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం నగదు జమ ప్రక్రియను ప్రారంభించింది.
రాష్ట్ర వ్యాప్తంగా సున్నా వడ్డీ మరియు కౌలు రైతులకు రైతు భరోసా నగదును మార్చి 18 రాత్రి నుంచి రైతులు ఖాతాలో జమ చేస్తున్నట్లు సమాచారం.
కాబట్టి అర్హత ఉన్నటువంటి రైతులు సున్నా వడ్డీ మరియు రైతు భరోసా స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు లేదా నేరుగా బ్యాంక్ కి వెళ్లి తమ బ్యాంకు ఖాతాలో అమౌంట్ పడిందో లేదో తెలుసుకోవచ్చు.
సున్నా వడ్డీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రాప్ డేటా ఆధారంగా చెల్లిస్తుంది. సున్నా వడ్డీ పథకానికి సంబంధించినటువంటి స్టేటస్ వివరాలను కింద ఇవ్వబడిన లింక్ లో ఇచ్చిన ప్రాసెస్ ని అనుసరించి మీరు తెలుసుకోవచ్చు.
ఇక వైయస్సార్ రైతు భరోసా కౌలు రైతులకు సంబంధించి మీ ఖాతాలో అమౌంట్ జమ అయిందా లేదా అనే వివరాలను మీ ఆధార్ నెంబర్ ను కింది అధికారిక లింకులో ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు.