ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటవ తేదీన జరిగే పెన్షన్ పంపిణీ ఒకరోజు ముందే ప్రారంభమైంది. ఎన్నడూ లేని విధంగా సెప్టెంబర్ నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి అధికారులు ఒకటవ తేదీ ఆదివారం రావడంతో ఒక రోజు ముందు అనగా ఆగస్టు 31 నే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 2024 పెన్షన్ సంబంధించి మొత్తం 64,61,485 మంది లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందిస్తున్నారు. ఆగస్టు 31 నే పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులు ఆదేశించారు.
ఏదైనా అనివార్య కారణాలు ఉంటే తప్ప తొలి రోజున పెన్షన్ పూర్తి చేయాలని, పెండింగ్ ఉన్నవారికి ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 2న పెన్షన్ అందించాలని సూచించారు. ఆగస్టు 31 న ఉదయం 9 గంటలకే దాదాపు 50 శాతం పెన్షన్ పూర్తి కావడం గమనార్హం.
పెన్షన్ పంపిణీ సంబంధించి అన్ని ముఖ్యమైన లింక్స్ మరియు గైడ్లైన్స్ ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.