Santoor Scholarship 2024 : విద్యార్థినులకు గుడ్ న్యూస్-సంతూర్ స్కాలర్ షిప్ కు దరఖాస్తులు ఆహ్వానం, ఇలా అప్లై చేసుకోండి

Santoor Scholarship 2024 : విద్యార్థినులకు గుడ్ న్యూస్-సంతూర్ స్కాలర్ షిప్ కు దరఖాస్తులు ఆహ్వానం, ఇలా అప్లై చేసుకోండి

Santoor Scholarship 2024 : గ్రామీణ ప్రాంత పేద విద్యార్థినులకు ఆర్థికసాయం అందించేందుకు విప్రో సంస్థ ‘సంతూర్ ఉమెన్ స్కాలర్ షిప్’ అందిస్తుంది. విద్యార్థినులను ఆర్థికంగా ఆదుకుని, వారు చదువుల్లో రాణించేలా చేసేందుకు విప్రో సంస్థ ఏడాదికి రూ.24 వేలు స్కాలర్ షిప్ రూపంలో అందిస్తుంది. ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు. పేద విద్యార్థినుల చదువును ప్రోత్సహించడానికి విప్రో కన్సూమర్‌ కేర్, విప్రో కేర్స్‌ ఏటా ఈ స్కాలర్ షిప్ ను అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లోని 1500 మంది పేద విద్యార్థినులకు ఈ ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.

గత ఎనిమిది సంవత్సరాలుగా దాదాపు 8000 మంది విద్యార్థులు సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా సహాయం అందించారు. ప్రొఫెషనల్ కోర్సులు చేస్తున్న విద్యార్థినులతో పాటు, హ్యుమానిటీస్, ఆర్ట్స్, సైన్స్ కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న బాలికలు ఈ స్కాలర్ షిప్ నకు దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. వెనుకబడిన జిల్లాల విద్యార్థులకు ముందుగా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విద్యార్థినులు సెప్టెంబర్ 20వ తేదీలోపు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

Santoor Scholarship 2024 Eligibility – స్కాలర్ షిప్ దరఖాస్తుకు అర్హతలు

  • స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి.
  • 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాల లేదా జూనియర్ కళాశాలలో ఇంటర్ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
  • 2024-25 విద్యాసంవత్సరానికి గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవాలి. గ్రాడ్యుయేట్ కోర్సు కనీసం 3 సంవత్సరాల వ్యవధి ఉండాలి.
  • హ్యుమానిటీస్, లిబరల్ ఆర్ట్స్, సైన్సెస్‌లో ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న విద్యార్థినులకు ప్రాధాన్యత ఉంటుంది.

Santoor Scholarship 2024 Requried Documents – దరఖాస్తుకు అవసరమయ్యే పత్రాలు

  • ఇటీవలి దిగిన పాస్‌పోర్ట్ సైజు ఫొటో
  • డిగ్రీ కళాశాల గుర్తింపు కార్డు
  • 12వ తరగతి, 10వ తరగతి మార్క్స్ షీట్లు
  • ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లేదా ఏదైనా ఐడీ ప్రూఫ్
  • దరఖాస్తుదారు బ్యాంక్ పాస్‌బుక్ ఫొటో కాపీ (గ్రామీణ్ బ్యాంక్ కాకుండా)

Santoor Scholarship 2024 Application Process – సంతూర్ స్కాలర్ షిప్ నకు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు?

STEP 1 : సంతూర్ స్కాలర్ షిప్ వెబ్ సైట్ https://www.santoorscholarships.com/ లింక్ పై క్లిక్ చేయండి.

STEP 2 : హోం పేజీలోని ‘Apply Online Now’ బటన్‌ను క్లిక్ చేయండి.

STEP 3 : తర్వాతి పేజీలో ‘Apply Now’ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

STEP 4 : మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకుని ఐడీని పొందండి.

STEP 5 : మీ ఐడీతో buddy4study ఖాతాలో లాగిన్ అవ్వండి.

STEP 6 : సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024-25’ దరఖాస్తు ఫారమ్ పేజీ ఓపెన్ అవుతుంది.

STEP 7: అప్లికేషన్ ప్రాసెస్‌ను ప్రారంభించడానికి ‘Application Start’ బటన్‌ను క్లిక్ చేయండి.

STEP 8 : ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో విద్యార్థిని వివరాలను పూరించండి.

STEP 9 : సంబంధిత సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి.

STEP 1 0: ‘నిబంధనలు, షరతులు’ అంగీకరించి, ప్రివ్యూపై క్లిక్ చేయండి.

STEP 1 1: ప్రివ్యూలో అన్ని వివరాలు సరిగ్గా ఉంటే, ‘సబ్మిట్’ బటన్‌పై క్లిక్ చేసి అప్లికేషన్ పూర్తి చేయండి.

స్కాలర్ షిప్ నకు ఎంపికైన విద్యార్థినులకు మూడేళ్లు లేదా కోర్సు పూర్తయినంత వరకు ప్రతినెలా రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.24 వేలు స్కాలర్‌షిప్‌ ఇస్తారు. డబ్బు నేరుగా వారి విద్యార్థినుల బ్యాంకు ఖాతాలో వేస్తారు. స్కాలర్ షిప్ దరఖాస్తులకు సెప్టెంబర్‌ 20 చివరి తేదీ.

ఏవైనా సందేహాల కోసం సంప్రదించండి

ఏవైనా ప్రశ్నలు ఉంటే, దయచేసి వీరిని సంప్రదించండి:

011-430-92248 (Ext: 121)/7337835166 (English)/7411654395/7411654394 (Telugu)/7411654393(Hindi) (Monday to Friday – 10:00AM to 06:00 PM (IST))

Email id : santoor.scholarship@buddy4study.com

You cannot copy content of this page