ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు సంవత్సరాలుగా సేవలందించినటువంటి సచివాలయాలు ఇక కనుమరుగవుతాయా ? ఇప్పటికే ఉంచుతారా తీసేస్తారా అన్న సందేహంలో ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఇకపై కనుమరుగవుతుందా? వాలంటీర్ వ్యవస్థ మరియు సచివాలయాలపై కీలక అప్డేట్ మీకోసం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలను మరియు వాలంటీర్ వ్యవస్థలో మిగిలి ఉన్నటువంటి వాలంటీర్లను ఇకపై వివిధ గ్రామీణ మరియు పట్టణ శాఖలో విలీనం చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి శ్రీధర్ కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు.
వాలంటీర్లను పంచాయితీ వ్యవస్థతో అనుసంధానం చేస్తామని ఇప్పటికే పలుసార్లు అధికారిక వర్గాలు వెల్లడించిన నేపథ్యంలో ఇకపై అదే జరగబోతుందని మంత్రి తెలిపారు.
అంతేకాకుండా గ్రామ, వార్డు సచివాలయాలను కూడా వివిధ శాఖల్లో అనుసంధానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఆయా సచివాలయాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని కూడా వివిధ శాఖలకు బదిలీ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏ ఏ శాఖల్లో వీరిని విలీనం చేస్తారు అనే దాని పైన సర్వత్ర ఆసక్తి నెలకొంది. ప్రాథమిక సమాచారం మేరకు పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామీణ గ్రామ వార్డు సచివాలయాలను మరియు వాలంటీర్లను అనుసంధానం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. పట్టణాల్లో మున్సిపల్ శాఖలో కూడా వీరిని వీలినం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది ఇక రాష్ట్రవ్యాప్తంగా రాజీనామాలు చేసిన తర్వాత ప్రస్తుతం 1.06 లక్షల మంది వాలంటీర్లు మిగిలి ఉన్నట్లు మంత్రి వెల్లడించారు వారిని కూడా వివిధ శాఖలో భర్తీ చేయనున్నారు