ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పంపిణీ పై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇకపై ప్రతినెలా ఒకటవ తేదీన సచివాలయం సిబ్బంది నేరుగా ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తారని మంత్రి పార్థసారథి వెల్లడించారు.
గతంలో పెన్షన్ పంపిణీ వాలంటీర్ల ద్వారా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇక పైన సచివాలయం సిబ్బంది చేస్తారని ఆయన అన్నారు.
ఎన్నికల సమయంలో పాక్షికంగా బ్యాంక్ ఖాతాలో పెన్షన్ అమౌంట్ జమ చేయడం జరిగింది. అయితే జూలై 1 నుంచి సచివాలయం సిబ్బంది నేరుగా ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తారని ఆయన వెల్లడించారు.
మరి వాలంటీర్ల పరిస్థితి ఏంటి అని అడిగిన ప్రశ్నకు ఆయన క్లారిటీ ఇవ్వలేదు. వారు కూడా సిబ్బందితోపాటు పని చేస్తారేమో అని అన్నారు. వారిని ఏ విధంగా వినియోగించుకోవాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు. అయితే పెన్షన్ పంపిణీ మాత్రం కచ్చితంగా సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఒకటో తేదీ సాయంత్రానికి పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని వెల్లడించారు. వాలంటీర్లను కొనసాగిస్తామని తెలుపుతున్న ప్రభుత్వం మరి వాలంటీర్లను నేరుగా పంచాయతీలకు అనుసంధానం చేసి సర్పంచుల కింద ఏవైనా పనులు అప్పగిస్తారా అనేది తేలాల్సి ఉంది.
గతంలో ఇస్తున్న 3000 పెన్షన్ ను ప్రస్తుతం నాలుగు వేలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. ఈ పెంచిన పెన్షన్ ఏప్రిల్ నుంచి అమలైన నేపథ్యంలో జూలై 1వ తేదీ 7 వేల రూపాయలు పెన్షన్ అందించనున్నారు. ఆ తర్వాత నెల నుంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు. దివ్యాంగులకు 6000 కు పెన్షన్ పెంచడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది పెంచిన పెన్షన్ ను జూలై 1 నుంచి అందుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు. పెంచిన పెన్షన్ వివరాలను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి.